తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతగా ఇష్టపడతారో ఆయన తర్వాత వచ్చిన పవన్ కళ్యాన్ అంటే కూడా మెగా ఫ్యాన్స్ అంతగా ఇష్టపడతారు.  కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే పవన్ కోసం ఏదైనా చేయడానికి సిద్దపడతారు.  ప్రస్తుతం ఆయన సినీ, రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు ఇండస్గ్రీలో పవన్ కళ్యాన్ దైవంగా భావించే వారిలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ముందుంటారు.  ఎవరి ఫంక్షన్ కి వెళ్లినా... చివర్లో తన దైవం పవన్ కళ్యాన్ కి జై అంటుంటారు.  తాజాగా గబ్బర్‌ సింగ్ సినిమా విడుదలై ఎనిమిదేళ్లవుతున్న సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పొగుడుతూ నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

 

'గబ్బర్ సింగ్.. ఇది నాకు నా దైవ సమానులైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన భిక్ష.. ఎప్పటికీ నేను కృతజ్ఞుడిని' అని ఆయన వరుసగా ట్వీట్ చేశారు. 'ఎనిమిదేళ్లు కాదు 80 ఏళ్ల తర్వాత కూడా మన గబ్బర్ సింగ్ గురించి చర్చిస్తారు.. పవర్ స్టార్ ఎప్పటికీ ఓ చరిత్ర. పవన్ కల్యాణ్ ఒక వ్యసనం.. అలవాటు అయ్యారంటే చచ్చిపోయే దాక మర్చిపోలేం' అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. 'ఈ రోజుల్లో నిన్నటి రోజున పొందిన సహాయాన్ని మర్చిపోయి మళ్లీ ఎదురు తిరిగి వారిని ప్రశ్నిస్తారు.

 

కానీ, నేను మాత్రం ఈ జన్మంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను' అని బండ్ల గణేశ్ చెప్పారు.  'అందరూ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు. నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను' అని తెలుపుతూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఇలా పవన్ పై తన అభిమానాన్ని వరుసగా ట్విట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేశాడు బండ్ల గణేష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: