యంగ్ హీరో సుధీర్ బాబు ,వి లో సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. అందుకు సంబందించిన స్టిల్ ను ఈరోజు  సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం  విడుదలచేసింది. ఆపిక్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ తో కనిపించగా ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అంతేకాదు సుధీర్ బాబు లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో  సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా నేచురల్ స్టార్ నాని విలన్ పాత్రలో కనిపించనున్నాడు. క్లైమ్యాక్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలువనుంది. నిజానికి మార్చి లోనే విడుదలకావల్సిన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదాపడింది. ఆతరువాత  నేరుగా డిజిటల్ లోకి రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినా  మేకర్స్ ఆసక్తి చూపించలేదు. ప్రభుత్వం నుండి థియేటర్ల రీ ఓపెన్ కు అనుమతివచ్చాక వి ని విడుదలచేయనున్నారు. 
యాక్షన్ థ్రిల్లర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి  డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నివేధ థామస్ , అధితి రావ్ హైదరి కథానాయికలు నటించగా సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు. దిల్ రాజు ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు. ఇక నాని కి ఇది 25వ సినిమా కావడం విశేషం. గత ఏడాది గ్యాంగ్ లీడర్ తో ప్లాప్ ను ఖాతాలో వేసుకున్న నానివి పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: