విజయ్ దేవరకొండ... ఈ పేరుకి పెద్ద పరిచయం అవసరం లేదు. 2017 వ సంవత్సరం లో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని ఉర్రూతలూగించిన ఇతడి సినిమాలు ఇటీవల కాలంలో అంతగా ప్రేక్షకాదరణ పొందే లేకపోయినా అతడి క్రేజ్ మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉండిపోయింది. గతంలో తెలుగు పరిశ్రమలోనే సినీ అవకాశాలు లభించక ఎన్నో ఇబ్బందులు పడ్డ విజయ్ దేవరకొండ ప్రస్తుతం హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ తో కలిసి వంద కోట్ల డీల్ కుదుర్చుకున్న ఏకైక తెలుగు హీరో గా ఎదిగాడు.


పాతికేళ్ళ వయసులో తన బ్యాంకు అకౌంట్ లో 500 రూపాయలు కూడా లేని ఆ విజయ్... ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ నగరంలో చాలా కోట్ల రూపాయలతో విలాసవంతమైన ఇల్లు కట్టించాడు. తన నాన్న గత 30 సంవత్సరాల నుండి హైదరాబాద్ సిటీ లో ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారట. అందుకే తన నాన్న చిరకాల కోరికను తీర్చేందుకు హైదరాబాద్ నగరంలో అతిపెద్ద ఇల్లు కట్టి తనను ఎంతో సంతోషపెట్టాడు. మొదటిలో హీరో నాని సరసన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ అంతకు ముందు ఎన్నో కష్టాలు పడ్డాడు.


2011 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతను చిన్నా చితకా అవకాశాలు వచ్చినా వదిలిపెట్టకుండా నటించేవాడు. హీరో నాని కి ఎవడే సుబ్రహ్మణ్యం లో చాలా చక్కగా నటించిన విజయ్ దేవరకొండ చేయమని విషయాలతోపాటు సినిమా అవకాశాలు బాగా పెరిగిపోయాయి. దాంతో నాలుగు చిత్రాల్లో ఒకేసారి నటించాడు విజయ్ దేవరకొండ. అయితే వాటిలో పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అయ్యి అతడిని స్టార్ హీరోల దీటుగా నిలబెట్టాయి. రష్మిక మందాన సరసన గీతాగోవిందం డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించిన రౌడీ బాయ్ కి ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం ఊర మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే సరసన విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: