హీరోగా 50 సినిమాల మైలురాయి చేరుకోవడమంటే నేటి జనరేషన్ హీరోలకు కాస్త కష్టమైన విషయమే. ఇటువంటి ఫీట్ ను అవలీలగా దాటేశాడు అల్లరోడు ‘అల్లరి నరేశ్’. అల్లరి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు. తెలుగులో కామెడీ హీరోగా చక్రం తిప్పిన రాజేంద్రప్రసాద్ స్లాట్ ను ఫుల్ ఫిల్ చేసిన హీరోగా ఎదిగాడు. నిన్నటి (మే10)తో హీరోగా నరేశ్ అల్లరి మొదలుపెట్టి, అల్లరి సినిమా విడుదలై 18 ఏళ్లు పూర్తయ్యాయి. తన ఎదుగుదలకు, కెరీర్ కు సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్ లో అల్లరి నరేశ్ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు.

IHG

 

‘18ఏళ్ల వయుసులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాకు కెరీర్ పరంగా 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్లలో నేను ఇండస్ట్రీలో నేర్చుకున్నది వినయంగా ఉండటమే. ఇన్నేళ్లుగా నన్ను అభిమానించిన నా ఫ్యాన్స్ కు, ప్రేక్షకులందరకీ ధన్యవాదాలు. హిట్స్ ఇచ్చినప్పుడు మాత్రము కాకుండా ఫ్లాప్స్ ఇచ్చిన సమయంలో కూడా నన్ను ఆదరించారు. ఇన్నేళ్ల సినిమా అనుభవంతో, మీ అభిమానంతో నాపై నేను నమ్మకం పెంచుకుని నా పనిలో ముందుకు వెళ్తున్నాను. ప్రస్తుత సమయంలో అందరూ బాగుండాలి. ఇళ్లలోనే ఉండండి క్షేమంగా ఉండండి’ అని పోస్ట్ చేశాడు.

IHG

 

దర్శకుడిగా రవిబాబు కెరీర్ కు కూడా నిన్నటితో 18 ఏళ్లే. సరికొత్త కాన్సెప్ట్ తో కేవలం యూత్ ని మాత్రమే టార్గెట్ చేసి తీసిన అల్లరి హిట్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ గా కాకుండా భిన్నంగా తీశాడు దర్శకుడు. హీరోగా నరేశ్ తన క్యారెక్టర్ ను చాలా సహజాంగా చేశాడు. దీంతో నరేశ్ కాస్తా అల్లరి నరేశ్ గా పాపులర్ అయిపోయాడు. సరేశ్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై సురేశ్, రవిబాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: