ప్రస్తుతం సౌత్ ఇండియాలో క్యూట్ లవర్స్, లవ్ బర్డ్స్ అనదగ్గ జంట విఘ్నేశ్ శివన్ – నయనతార జంటే. వీళ్లిద్దరి ఫోటో లేని సోషల్ మీడియా అకౌంట్ ఉండదంటే అతిశయోక్తి లేదు. వీరిద్దరి ప్రేమ గురించే కాకుండా పెళ్లి గురించి ఏ వార్త వచ్చినా సెన్సేషనే. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వీరిద్దరూ కలిసి ఓ ఫొటో పెట్టారంటే ఫ్యాన్స్ కు పండగే. నిన్న మదర్స్ డే సందర్భంగా విఘ్నేశ్ శివన్ తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ పిక్, దానికి విఘ్నేశ్ ఇచ్చిన క్యాప్షన్ వైరల్ గా మారింది.

 

'నా పిల్లలకు తల్లి నయనతారే' అంటున్న విఘ్నేశ్ శివన్

నయనతార ఓ చిన్నారిని ఎత్తుకుని ఉన్న ఫోటోను విఘ్నేశ్ పోస్ట్ చేశాడు. ఈ ఫోటోకు ‘భవిష్యత్తులో నా పిల్లలకు తల్లి కాబోయే నయనతార చేతుల్లో ఉన్న ఆ చిన్నారి తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.’ అంటే కవితాత్మకంగా రాసుకొచ్చాడు. దీంతో నయన్ – విఘ్నేశ్ పెళ్లిపై వస్తున్న నెగటివ్ వార్తలకు చెక్ పెట్టినట్టైంది. ఈ మెసేజ్, పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ‘పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు’, ‘పెళ్లి డేట్ ఎప్పుడు చెప్తున్నారు’, ‘మీ పెళ్లిపై మంచి క్లారిటీ ఇచ్చారు’ అంటూ ఈ నయన్, విఘ్నేశ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు బాగా రెస్పాండ్ అయ్యారు.

 

 

విదేశాల్లో తీసిన ఈ ఫోటోలో నయన్ చాలా అందంగా ఉంది. సూర్యాస్తమ సమయంలో బ్లాక్ డ్రెస్ లో నయన్ మెరిసిపోతోంది. రీసెంట్ గా వీరిద్దరి మధ్యా విబేధాలు వచ్చాయంటూ అనేక గాసిప్స్ రౌండ్ అయ్యాయి. ఆ వార్తలపై వారిద్దరూ స్పందించ లేదు. ఇప్పుడు విఘ్నేశ్ ఇచ్చిన క్లారిటీలో ఏకంగా పిల్లల ప్రస్తావన రావడంతో వీరి పెళ్లి పక్కా అని తేలిపోయింది. కెరీర్ పరంగా విఘ్నేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రజినీకాంత్ అన్నాథే సినిమాల్లో నయన్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: