బండ్ల గణేష్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. కమెడియన్ గా తన ప్రస్థానాన్ని స్థాపించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. మొదటి రెండు మూడు సినిమాలు బురిడీ కొట్టినప్పటికీ ఆ తర్వాత కొన్ని సినిమాలు  మంచి విజయం సాధించడంతో కొన్ని  రోజులపాటు స్టార్ నిర్మాతగానే కొనసాగాడు. ఆ తర్వాత బండ్ల గణేష్  సినిమాలు అంతగా బాక్సాఫీస్ వద్ద ఆదరణ లేకపోవడంతో మళ్లీ కమెడియన్ గా అవతారమెత్తాడు . అయితే బండ్ల గణేష్ అసలు కమీడియన్నా.. లేక నిర్మతన అన్న విషయం పక్కన పెడితే బండ్ల గణేష్ వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ ఉంటాయి అన్న  విషయం తెలిసిందే. 

 


 చేతికి మైక్ దొరికిందంటే చాలు పూనకం వచ్చినట్లుగా ఊగి పోతూ ఉంటాడు బండ్ల గణేష్. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఎంతోమంది పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఏవో పిచ్చి పిచ్చిగా విమర్శలు చేయడం ఆ తర్వాత రెండు రోజులకే క్షమాపణలు చెబుతూ వెనక్కి తీసుకోవడం. రాజకీయాల్లో ఇదే చేస్తూ వచ్చారు. ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్ పై ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. 

 

 ఆ తర్వాత తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఎన్టీఆర్ ను  క్షమాపణలు కోరుతు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు . ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే  బండ్ల గణేష్ చేశాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ పోస్ట్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన పోస్ట్ లో ఏముంది అంటారా . జీవితంలోకి కిక్  కావాలంటే ఒక్క సినిమాలే .. నేను డిసైడ్ అయ్యాను.. సినిమాలే నా జీవితం సినిమా నా ప్రాణం... నా 15 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీ కి వచ్చాను.నాకు  రాజకీయాలు వద్దు కేవలం సినిమా మాత్రమే ముద్దు. నావల్ల నా మాటల వల్ల బాధపడ్డా ప్రతి ఒక్కరికీ క్షమాపణ కోరుతున్నాను అంటు పెట్టిన పోస్ట్ పై  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: