కరోనా వల్ల  లాక్ డౌన్ అమల్లోకి రావడం తో సినిమా షూటింగ్ లు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకూడా బంద్ అయ్యాయి. అయితే తాజాగా సోమవారం నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోవడానికి తమిళనాడు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో కోలీవుడ్  సినిమాలు ఆ పనుల్లో బిజీ గా వున్నాయి. అందులో భాగంగా తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్ని బాగుంటే ఈసినిమా ఏప్రిల్ లోనే విడుదలకావాల్సి  ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్ కు పర్మిషన్ ఇవ్వగానే మాస్టర్ ను విడుదలచేయాలని భావిస్తున్నారు. అయితే  ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం తో మరో నెల వరకు థియేటర్లు తెరుచుకొనే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి. 
 
ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ , కాలేజీ ప్రొఫెసర్ గా కనిపించనుండగా మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తుండగా విజయ్ కి జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్ బి క్రియేటర్స్ పతాకం పై బ్రిట్టో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈసినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ దక్కించుకోగా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు  సొంతం చేసుకుంది.
 
ఇక మాస్టర్ తెలుగులో కూడా విడుదలకానుంది. mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమా హక్కులను దక్కించుకున్నాడు. విజయ్ నటించిన సర్కార్, విజిల్ తెలుగులో కూడా సూపర్ హిట్లు కావడంతో మాస్టర్ కు కూడా  మంచి బజ్ ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: