బన్నీ.... తెలుగులో మెగా క్యాంపు  టాప్ హీరోల్లో ఒకడు. బన్నీకి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. అయినా కొత్తదనం కోసం బన్నీ ఎపుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రతీ సినిమాలో తనను తాను చూసుకోడు. పాత్రను మాత్రమే చూడాలనుకుంటాడు. అందుకే బన్నీ వైవిధ్యం ఉన్న సినిమాలు ఎక్కువ చేశాడు.

 

ఇపుడు బన్నీకి అలాంటి సినిమా ఒకటి సవాల్ చేస్తోంది. అదే పుష్ప‌. ఈ సినిమా పక్కా మాస్ మూవీ. బన్నీ ఫస్ట్ లుక్  చూస్తేనే  రఫ్ గా కనిపిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రం సినిమా అల వైకుంఠపురంలో పూర్తి స్టైలిష్ గా కనిపించిన బన్నీకి, ఇపుడు రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్న బన్నీకి ఎంతో వేరియేషన్ ఉంది. అదే బన్నీకి కావాల్సింది.

 

బన్నీ పుష్పలో ఎర్ర చందనం సరఫరా చేసే లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూవీ కోసం బన్నీ మేకోవర్ పూర్తిగా చేంజి  చేశాడు. బన్నీ మొరటుగా కనిపించేందుకు చూస్తున్నాడు. ఈ విషయంలో తేడా లేదంటున్నాడు. తమిళనాడు బోర్డర్ లో ఉండే వారు మాట్లాడే తెలుగు, రాయలసీమ యాస మిక్సింగ్ అన్నీ కూడా బన్నీ ఇపుడు బట్టీపడుతున్నాడు.

 

ఓ విధంగా పాన్ ఇండియా మూవీగా తయారవుతున్న ఈ పుష్పతో బన్నీ బిగ్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు కరువు తీరిపోయే విజయం సొంతం కావాలని బన్నీ అంచనాలు వేసుకుంటున్నాడు. బన్నీ లాక్ డౌన్ పీరియడ్ ని ఏ మాత్రం వేస్ట్ చేయకుండా ఈ పనిలో ఇపుడు బిజెగా ఉన్నాడు. మొత్తానికి బన్నీ మొరటుగా కనిపిస్తూనే ఫ్యాన్స్ చేత ఈలలు  పెట్టించాలనుకుంటున్నాడుట. 

 

ఇక ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్. రంగస్థలం మూవీలో రాం చరణ్ ని పూర్తిగా గ్రామీణ యువకుడిగా చూపించిన సుక్కూకు బన్నీని మరింత  వైరైటీ గా చూపించడం కష్టం కూడా కాదు, పైగా బన్నీ, సుక్కూల మధ్య మంచి ఎమోషనల్ బ్యాడేజ్ కూడా పుష్ప సూపర్ గా తయారవడానికి మరో రీజన్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: