మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వీటిలో సూపర్ హిట్ కేటగిరీలో వచ్చే సినిమా ‘కొదమసింహం’. కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి కౌబాయ్ మేకోవర్, సెట్టింగ్స్ కు మంచి పేరు వచ్చింది. తెలుగులో వచ్చిన కౌబాయ్ సినిమాల్లో కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు తర్వాత కొదమసింహం మూవీ ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంలో మోహన్ బాబు చేసిన సుడిగాలి పాత్ర చాలా కీలకం అని చెప్పాలి.

IHG

 

మొదట్లో సత్యానంద్ ఈ కథ రాసుకున్నప్పుడు మోహన్ బాబు పాత్ర చిరంజీవి తల్లిదండ్రులు ఎవరో చెప్పకుండా చనిపోతుంది. కథలో కీలకమైన ఈ పాయింట్ లో చిరంజీవికి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. దీంతో పరుచూరి బ్రదర్స్ ను పిలపించి కథలో ఆయనకు వచ్చిన సందేహం గురించి చెప్పి మార్పులేమన్నా చేయగలమా అని అడిగారట. కథ విన్న గోపాలకృష్ణకు మోహన్ బాబు పాత్ర చనిపోతే సినిమా అంతా చిరంజీవి తన తల్లిదండ్రులెవరో వెతుక్కునే పనిలో ఉంటాడు తప్ప సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండదని చెప్పారట. సుడిగాలి పాత్రను చంపకుండా టామ్ అండ్ జెర్రీ తరహాలో ఇద్దరి మధ్యా సన్నివేశాల్ని పెంచితే సినిమా చివరి వరకూ టెంపో మెయింటైన్ అవుతుందని చెప్పారట.

IHG

 

ఈ పాయింట్ చిరంజీవికి నచ్చడంతో పరుచూరిని స్క్రీన్ ప్లేకు వర్క్ చేయమని చెప్పారట. టైటిల్స్ లో కథ, మాటలు సత్యానంద్, స్క్రీన్ ప్లే పరుచూరి బ్రదర్స్ గా వేశారు. ఆ సినిమాలో సుడిగాలి పాత్రలో మోహన్ బాబు చేసిన కామెడీ సినిమా ఆద్యంతం నవ్వించేలా డిజైన్ చేశారు పరుచూరి సోదరులు. 1990లో కొండవీటిదొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత కొదమసింహం చిరంజీవికి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: