లాక్ డౌన్ దెబ్బకు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు తీవ్ర స్థాయిలో నష్టాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో వేసవి సందర్భంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దేశంలో వైరస్ పరిస్థితి చూస్తుంటే మరో నెల రోజుల వరకూ థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోపక్క సినిమా ప్రేక్షకులు కూడా లాక్ డౌన్ వలన  ఓటిటి లకు బాగా అలవాటు పడ్డారు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటిటి సంస్థలు చిన్న సినిమాలను మీడియం రేంజ్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. చాలావరకు ఓటీటీ సంస్థలు సినిమా నిర్మాతల వెంట పడుతున్నాయి.

 

 సినిమాలను డైరెక్ట్ గా ఓటిటి లో తమ కంపెనీల ద్వారా విడుదల చేయాలని డిజిటల్ ప్లాట్ ఫామ్ లా ద్వారా ప్రేక్షకులకు అందించాలని కోరుతున్నాయి. అయితే డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా నిర్మాత సినిమా రిలీజ్ చేస్తే కనుక పెద్దగా డబ్బు మిగిలే అవకాశం ఉండదు నష్టాలే ఉంటాయని ఇండస్ట్రీ ట్రేడ్ వర్గానికి చెందిన వారు అంటున్నారు. మామూలుగా అయితే సినిమా ఇండస్ట్రీకి మంచి సీజన్ సమ్మర్.

 

వేసవిని టార్గెట్ చేసుకుని చాలామంది నిర్మాతలు స్క్రిప్ట్ రెడీ చేసుకుని డబ్బులు వడ్డీకి తెచ్చుకుని సినిమాలు నిర్మిస్తారు. అయితే తాజాగా ఈ వేసవికి ముందు కరోనా వైరస్ రావటంతో ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సమ్మర్ కి విడుదల కావల్సిన సినిమాలన్ని వాయిదా పడటంతో పాటు రిలీజ్ అవ్వల్సినా సినిమాలు ఎప్పుడు రిలీజ్ చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడటంతో, నిర్మాతలు సినిమా పై పెట్టిన పెట్టుబడి పై వడ్డీ ల మీద వడ్డీలు పడుతున్నాయి. చాలావరకు నిర్మాతలు కరోనా వైరస్ దెబ్బకి దారుణమైన నష్టాలని ఎదురుకుంటున్నరు. 

 

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: