టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా చెయ్యాలి అంటే చాలా మంది భయపడే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సినిమాలు చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచన చేసి సినిమాలను చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లాక్ డౌన్ తర్వాత సినిమాల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టత లేదు. అసలు జనాలు సినిమాలు చూస్తారా లేదా అనేది తెలియదు. టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే ఏ ఒక్క చోట కూడా ఇప్పుడు సినిమాలు చేయడానికి చాలా మంది ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తున్నారు. 

 

ఈ తరుణంలో టాలీవుడ్ యువ హీరో రానా మాత్రం ఒక భారీ ప్రయోగానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో అతనికి ఉన్న ఇమేజ్ ని పక్కన పెట్టి ఒక భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాడు. సినిమా సింపిల్ గా ఉన్నా సరే బడ్జెట్ 80 కోట్ల వరకు పెట్టే బడ్జెట్ ఉంటుంది అనేది అంటున్నారు. బాలీవుడ్ హీరో తో కలిసి రానా ఇప్పుడు ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం భారీ పెట్టుబడి పెట్టి ఇతర భాషల్లో కూడా దాన్ని విడుదల చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 

ఆ  ప్రయత్నం అతను ఎందుకు చెయ్యాలి అనుకున్నాడు అనేది పూర్తి గా తెలియదు గాని తండ్రి ని కూడా అడగకుండా తాను ఈ సినిమా చేయడానికి అతను పూర్తి గా సిద్దమైనట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ సినిమా కథ గురించి దర్శకుడి తో చర్చలు కూడా జరుపుతున్నాడు అని అంటున్నారు. ఈ సినిమాలో అతను తనకు ఉన్న స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి చేసే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: