టాలీవుడ్ లో మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి వచ్చిన డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆమెకు అప్పటి నుంచి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె తో సినిమాలు చేయడానికి అప్పటి నుంచి చాలా మంది ప్రయత్నాలు చేసినా సరే పెద్దగా ఫలితం ఇవ్వలేదు అనేది వాస్తవం. ఆమె అప్పుడు చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంది. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలిఉయదు గాని అప్పుడు ఆమె తో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా ఆమె మాత్రం సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె కోసం కొందరు స్టార్ హీరోలు మన తెలుగులో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాలో ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆమెను ఆ సినిమాలో హీరోయిన్ గా కాదు అని ఒక కీలక పాత్రలో తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆ సినిమా తో పాటుగా మహేష్ బాబు హీరో గా వచ్చే సినిమాలో కూడా ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నానీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఆమెను తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది తెలియదు. 

 

ఇక దాని తో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో కూడా ఆమెను తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది ఇప్పుడు. ఆమెను కచ్చితంగా తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఆమెకు నటిగా మంచి గుర్తింపు ఉంది. స్కిన్ షో చేయకపోయినా సరే ఆమె మాత్రం ప్రేక్షకులకు ఎక్కడా కూడా వినోదాన్ని తగ్గించే అవకాశం ఉండదు అని అంటారు. ఆ విధంగా ఆమె కోసం క్రేజ్ అనేది వచ్చింది అని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: