మాస్ మహారాజ రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా తెరకెక్కిన మాస్ కమర్షియల్ సినిమాల భద్ర, సరిగ్గా రేపటి రోజున 15 సంవత్సరాల క్రితం, 2005లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు తొలిసారిగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వచించడం జరిగింది. దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రదీప్ రావత్ మెయిన్ విలన్ గా నటించారు. 

 

వాస్తవానికి అంతకముందు వరకు దిల్ రాజు బ్యానర్ లోని అక్కడక్కడ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన బోయపాటి, మరొక కథకుడైన కొరటాల శివ తో కలిసి మంచి కథ సిద్ధం చేయడం, దానిని రాజు కు వినిపించడం జరిగిందట. ఆ తరువాత అదే కథ రవితేజకు అయితే సరిగ్గా సరిపోతుందని భావించిన రాజు, ఆ వెంటనే రవితేజ వద్దకు వారిని తీసుకువెళ్లి స్టోరీ సిట్టింగ్స్ జరపడం జరిగిందట. ఆ విధంగా ఈ సినిమాకు తొలి బీజం పడింది. ఈ కథకు నువ్వే దర్శకుడివి అయితే బాగుంటుందని బోయపాటిని తొలిసారిగా ఆ విధంగా దర్శకుడిగా పరిచయం చేసారు దిల్ రాజు.  అయితే హీరోయిన్ గా అప్పటికే పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించిన మీరా జాస్మిన్ అయితే కరెక్ట్ అని భావించి ఆమెను సెలెక్ట్ చేసారు. 

 

మంచి ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాకు మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ జోడించి దర్శకుడు బోయపాటి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాలోని ఫైట్స్ తో పాటు దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ కూడా అప్పట్లో మంచి పేరు దక్కించుకున్నాయి. ప్రకాష్ రాజ్, అర్జన్ బజ్వా, సునీల్, సుబ్బరాజు, ఈశ్వరి రావు, పద్మనాభం, మురళి మోహన్, సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా రేపటితో సక్సెస్ఫుల్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పలువురు రవితేజ ఫ్యాన్స్ రేపు సోషల్ మీడియా మాధ్యమాల్లో దీనిని ట్రెండ్ గా సెట్ చేసి వైరల్ చేయనున్నారు....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: