దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మరో భారీ మల్టిస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. యంగ్ టైగర్ ఎన్.ట్.ఆర్ కొమరం భీం గా, మెగా పవర్ స్టార్ రాం చరణ్ అల్లూరి సీతారామరాజుగా శక్తి వంతమైన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాం చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్, ఎన్టీఆర్ కి జంట గా ఒలివియా మోరిస్ నటిస్తుండగా సీనియర్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

 

అంతేకాదు వీరితో పాటు మరికొన్ని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. రే స్టీవెన్‌ సన్‌ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీ లని సెలెక్ట్ చేసుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాని నెమ్మదిగా సినిమాని మాత్రం ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని మీడియా సమావేశాలలో పాల్గొంటు ఒక్కొక్క పాత్ర కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తు సినిమా మీద బజ్ పెంచేలా చూస్తున్నారు జక్కన్న. ఈ నేపథ్యంలోనే అజయ్ దేవగణ్ ది ఆర్.ఆర్.ఆర్ లో ఎంతో కీలక పాత్ర అని సినిమాలో మంచి ట్విస్ట్ వచ్చే సమయంలో అజయ్ పాత్ర ఎవరూ ఊహించనంతగా ప్రభావం చూపుతుందని రాజమౌళి రివీల్ చేశారు.

 

ఇక అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారని అయితే ఈ పాత్ర కేవలం కొన్ని కీలకమైన సన్నివేశాల్లో మాత్రమే ఉంటుందని తాజా సమాచారం. అంతేకాదు అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని అజయ్ దేవగణ్ పాత్ర ఎంతో ప్రేరణాత్మకంగా ఉండనుందని క్లూ ఇచ్చారు. ఇక రీసెంట్ గా ఆలియా భట్ పాత్ర కూడా ఎన్టీఆర్చరణ్ పాత్రలను కలిపేదిగా ..ఈ సన్నివేశానికి థియోటర్స్ లో క్లాప్స్, విజిల్స్ పడటం ఖాయమని రీసెంట్ గా ఆలియా పాత్రని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి జక్కన్న స్ట్రాటజీ అదిరిపోయిందని ఈ విషయాలు వెల్లడవుతున్న నేపథ్యంలో అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: