అప్పటికే భలే మంచి రోజు సినిమాతో సుధీర్ బాబుకి కమర్షియల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈసారి నలుగురు హీరోలతో తీసిన క్రేజీ మల్టీస్టారర్ శమంతకమణి. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య బాగా హ్యాండిల్ చేశాడు. శమంతకమణి టైటిల్ చూసి ఇదేదో మణి కోసం నలుగురు హీరోలు చేసే ప్రయత్నం అనుకుంటారు. కానీ శమంతకమణి అంటే రోల్స్ రాయిస్ కారు కోసం వీళ్ళ వేట సాగుతుంది. 

 

సంపన్నుల కుటుంబంలో పుట్టిన కృష్ణుడు (సుధీర్ బాబు) కోసం వాళ్ళ నాన్న జగన్నాథం రోల్స్ రాయిస్ కారు కొనిస్తాడు. పార్టీ చేసుకునే టైం లో ఆ కారు కనబడకుండా పోతుంది. ఆ టైం లో పార్టీ లో పాల్గొన్న సందీప్ కిషన్, ఆది, రాజేంద్ర ప్రసాద్ ల మీద అనుమానం వస్తుంది. పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ కూడా మెప్పించారు.

 

కారు చుట్టూ తిరిగే ఈ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చాలా క్లవర్ గా హ్యాండిల్ చేశాడు. ఇద్దరు హీరోలు మల్టీస్టారర్ అంటేనే తీయడం కష్టం అనుకుంటుంటే ఏకంగా నలుగురు హీరోలతో చేశాడు శ్రీరామ్ ఆదిత్య. ఈ సినిమా కమర్షియల్ గా ఓ రేంజ్ లో ఆడకపోయినా సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చింది. డైరెక్టర్ టాలెంట్ మొదటి రెండు సినిమాలతోనే ప్రూవ్ అయ్యింది. 2018లో నాని, నాగార్జున హీరోలుగా వచ్చిన దేవదాస్ సినిమాను డైరెక్ట్ చేసింది కూడా శ్రీరామ్ ఆదిత్యనే. ఆ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య మహేష్ మేనల్లుడు అశోక్ హీరోగా చేస్తున్న సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: