డేరింగ్ అండ్‌ డాషింగ్ హీరో సూపర్‌ స్టార్‌ కృష్ణ కెరీర్‌ స్టార్టింగ్‌లోనే అదిరిపోయే థ్రిల్లర్‌లో నటించాడు. 1967లో రిలీజ్‌ అయిన అవే కళ్లు సినిమా బెస్ట్‌ థ్రిల్లర్‌ మూవీగా పేరు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్‌ అంటే పెద్దగా పరిచయం లేని సమయంలోనే ఆడియన్స్‌ను థియేటర్లలో కుర్చీలకు కట్టి పడేసిన సినిమా అవే కళ్లు. త్రిలోక్‌ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ, కాంచనమాల, రాజనాల, పద్మనాభం, రమణా రెడ్డి, గుమ్మడి, నాగ భూషణం కీలక పాత్రల్లో నటించారు.

 

కథ విషయానికి వస్తే సుశీ (హీరోయిన్‌ కాంచన) సెలవులకు తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటి వస్తుంది. ఇంట్లో తన ముగ్గురు బంధువులతో కలిసి ఉంటుంది. కానీ ఒకరోజు రాత్రి ఇంట్లోని ఓ వ్యక్తి ఓ ఆగంతకుడు హత్య చేస్తాడు. ఆ హత్యను చూసిన అతని భార్య షాక్‌ లో ప్యారలైజ్‌ అవుతుంది. దీంతో హంతకుడు ఎవరు అన్న విషయం ఎవరికీత తెలియదు. తరువాత కూడా వరుసగా ఆ ఇంట్లో హత్యలు జరుగుతుంటాయి. హంతకుడు కావాలనే తన గుర్తుగా కాల్చిన సిగరెట్‌ ముక్కలను వదిలేసి వెళుతుంటాడు.

 

ఈ కేసును చేదించేందుకు సుశీ, సింగర్‌ భాస్కర్‌ (కృష్ణ) సహాయం కోరుతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోని ప్రతీ ఒక్కరి మీద అనుమానం కలుగుతుంది. ఇన్వెస్టిగేషన్‌కు వచ్చిన పోలీస్‌ ఆఫీసర్‌, డాక్టర్‌ సిద్ధా, ఇంటి పని మనిషి ఇలా చాలా మందిని అనుమానిస్తారు. అదే సమయంలో సుశీకి హంతకుడు ఫోన్ చేసి బెదిరిస్తుంటాడు. ఈ పరిస్థితుల మధ్య భాస్కర్‌ ఎలాగైన సమస్యను పరిష్కరిస్తానని సుశీకి మాట ఇస్తాడు. మరి ఆ మాటను భాస్కర్‌ ఎలా నిలబెట్టుకున్నాడు? అసలు హంతకుడు ఎవరు..? అన్నదే సినిమాలో అసలు ట్విస్ట్‌. థ్రిల్లింగ్ కథకు హర్రర్‌ ఎలిమెంట్స్‌ కూడా జోడించి రూపొందించిన ఈ సినిమాలో అప్పట్లో చరిత్ర సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: