పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి ఆయన అభిమానుల్లో ఉత్సాహం మామూలుగా లేదు. ఆ ఉత్సాహం ఏ రేంజ్ లో నిన్నటితో మరింత బాగా అర్థమైంది. ఈ మధ్య సినిమా వార్షికోత్సవాలని సోషల్ మీడియా వేదికగా జరుపుకుంటూ ట్రెండ్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇలా ట్రెండ్ చేయడంలోనూ రికార్డు క్రియేట్ చేసేందుకు తహతహలాడుతున్నారు.

 

 

నిన్నటితో గబ్బర్ సింగ్ సినిమా రిలీజై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేశారు. హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆకలి తీర్చిన గబ్బర్ సింగ్ సినిమాని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే విధంగా టాలీవుడ్ లో ఏ హీరోకి వేయనన్ని ట్వీట్లు వేశారు. ౧౫మిలియన్ల ట్వీట్లని టార్గెట్ గా పెట్టుకున్న అభిమానులు పదిమిలియన్లకి పైగా ట్వీట్లు వేసి ట్రెండ్ సెట్ చేశారు.

 

 

ఈ సందడంతా చూస్తే ౮సంవత్సరాల తర్వాత గబ్బర్ సింగ్ సినిమా మళ్లీ రిలీజైనట్టు అనిపించింది. అయితే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ౨౮వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ పై అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్ మాదిరిగానే మరో మాస్ మాస్ సినిమా తీస్తాడని అనుకుంటున్నారు.

 

 

హరీష్ శంకర్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్టు వర్కు కూడా జరుగుతుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా ఎంచుకున్నాడు హరీష్. గబ్బర్ సింగ్ సినిమాలో మ్యూజిక్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే ఆ సినిమాకి మ్యూజిక్ అందించిన దేవీశ్రీప్రసాదే ఈ సినిమాకీ మ్యూజిక్ అందిస్తున్నాడూ. సూపర్ డూపర్ హిట్ సినిమా అందించిన ముగ్గురి కలయికలో మళ్లీ రిపీట్ కానుండడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: