లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో జనం అంతా చేయడానికి చెప్పుకోతగ్గ పనులు లేకపోవడంతో చాలామంది టివిలకు ఇంటర్నెట్ కు విపరీతంగా అతుక్కుపోతున్నారు. ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్న ఇంటర్నెట్ వినియోగాన్ని చూసి సర్వీసు ప్రొవైడర్లు కూడ షాక్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జనం ఇంటర్నెట్ లో ప్రముఖుల గురించి లాక్ డౌన్ పీరియడ్ లో వారు చేస్తున్న సేవాకార్యక్రమాల గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. 


ఈనేపధ్యంలో ఒకజాతీయ మీడియా సంస్థ దేశవ్యాప్తంగా ఈలాక్ డౌన్ పిరియడ్ లో ఏ సెలెబ్రెటీల గిరించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అన్న విషయమై నిర్వహించిన ఒక సర్వేలో కొన్ని ఆశ్చర్యకర ఫలితాలు బయటకు వచ్చాయి.  జాతీయ స్థాయిలో హీరోల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ గురించి అత్యధికంగా నెటిజన్స్ వెతికినట్లు తెలుస్తోంది. 21 లక్షల సెర్చ్ లు సల్మాన్ పేరుతో నమోదు అయ్యాయి అని అంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ చేస్తున్న సినిమాలు ఈ లాక్ డౌన్ పిరియడ్ లో సల్మాన్ చేసిన సేవా కార్యక్రమాల గురించి చాలఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఆతర్వాత స్థానంను విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. 


ప్రస్తుతం విరాట్ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలతో పాటు ఈ లాక్ డౌన్ పిరియడ్ లో విరాట్ జుట్టును అనుష్క శర్మ కటింగ్ చేసిన న్యూస్ ను కూడ దేశవ్యాప్తంగా విపరీతంగా చదివారని తెలుస్తోంది. ఈలిస్టుకు సంబంధించిన టాప్ 10లో మన తెలుగు హీరోలలో అందరికంటే ఎక్కువ ర్యాంక్ అల్లు అర్జున్ కు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ర్యాంకింగ్స్ లో బన్నీకి 5వ స్థానం రావడం వెనుక ‘అల వైకుంఠపురములో’ మ్యానియా బాగా పనిచేసింది అని అనుకుంటున్నారు. 

 

అయితే విజయ్ దేవరకొండ 8వ స్థానంను మహేష్ బాబు 10వ స్థానం వచ్చినప్పటికీ నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిన ప్రభాస్ కు అదేవిధంగా జూనియర్ చరణ్ లకు ఈ టాప్ 10లో చోటు దక్కకపోవడం ఒక విధంగా షాక్ అయ్యే విషయం. విజయ్ దేవరకొండ మహేష్ బాబుల తదుపరి సినిమాల గురించి వారు క్వారెంటైన్ టైం ను ఎలా గడుపుతున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్స్ ఎక్కువగా సెర్చ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే నెం.1గా ప్రియాంక చోప్రా నిలిచింది. ఈమెకు 39లక్షల సెర్చ్ లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలలో నటించకపోయినా సన్నీలియోన్ 31 లక్షల సెర్చ్ లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక జాబితాలో దక్షిణాదికి సంబంధించిన రష్మిక కు 10వ స్థానం లభిస్తే క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న పూజ హెగ్డే కు ఈ టాప్ 10లో స్థానం దక్కకపోవడం ఒక విధంగా ఆమెకు కరోనా ఇచ్చిన షాక్ అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: