కరోనా ఎఫెక్ట్ తో అన్ని వ్యాపారాలు దెబ్బతినడంతో ఫిలిం ఇండస్ట్రీ పై కూడ కరోనా కష్టాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనితో అంతకుముందులా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసే పరిస్థితులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇక ఉండబోవని అన్నఅభిప్రాయం ఏర్పడటంతో నిర్మాతలు అందరు మారినపరిస్థితులను బట్టి తాము కూడ మారుతూ సినిమాల బడ్జెట్ ను ప్రభావితం చేసే హీరోల పారితోషిక విషయంలో కోతలకు సహకరించమని అనేక ప్రముఖ నిర్మాతలు ఇప్పటికే తమకు సన్నిహితంగా ఉండే హీరోలతో రాయబారాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


లాక్ డౌన్ ముగిసిన తరువాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక సమావేశాన్ని పెట్టి ఈసమావేశానికి టాప్ హీరోల దగ్గర నుండి మిడిల్ రేంజ్ హీరోల వరకు అందర్నీ వ్యక్తిగతంగా ఆహ్వానించ బోతున్నారు. అంతేకాదు వారందరి చేత వారి పారితోషికాల విషయంలో ఎంతవరకు తమకు తాముగా కోతలు విధించుకుంటారు అన్నవిషయంలో స్పష్టత రావడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నారు. 


ఇప్పుడు ఈవిషయాలు అన్నీ టాప్ హీరోల దృష్టి వరకు రావడంతో వారి భవిష్యత్ సంపాదన తగ్గిపోతుంది అన్నఅంచనాలకు వచ్చి ఇంకా లాక్ డౌన్ ముగియకుండానే వారి ఆదాయాలకు సంబంధించి కొత్తమార్గాల అన్వేషణ మొదలుపెట్టినట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుత తరం టాప్ హీరోల ఆలోచనలు అన్నీ మ్యూజిక్ కంపెనీల వైపు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈఏడాది సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘అల వైకుంఠపురములో’ పాటలు అన్నీ సినిమాతో పాటు బ్లాక్ బష్టర్ హిట్ గా మారడంతో ఆపాటలను రిలీజ్ చేసిన ఆడియో కంపెనీకి విపరీతంగా రాయల్టీలు వచ్చినట్లు తెలుస్తోంది.  


ముఖ్యంగా ‘అల’ కు సంబంధించిన పాటలు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్స్ క్రియేట్ చేసాయి. ఈనేపథ్యంలో టాలీవుడ్ కి చెందిన కొంతమంది స్టార్ హీరోలకు ఆ ఆదాయాన్ని కూడా ఎందుకు వదులుకోవాలి అన్నఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే మధురా శ్రీధర్ పూరిజగన్నాథ్ లు సొంతంగా మ్యూజిక్ కంపెనీలను స్టార్ట్ చేసుకున్న విషయంతెలిసిందే. దీనికితోడు ఆడియోరంగంలో విపరీతమైన ఆదాయాలను పొందుతున్న ఆదిత్య మ్యూజిక్ అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. రానున్నరోజులలో తాము నటించే సినిమాల పారితోషికాలు తగ్గిపోతాయి అన్నస్పష్టమైన సంకేతాలు రావడంతో టాప్ హీరోలు అంతా నాగార్జున చిరంజీవిల మార్గాలను అనుసరిస్తూ వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఈ లాక్ డౌన్ సమయంలో లోతుగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే సొంత ప్రొడక్షన్ హౌస్ లను ప్రారంభించిన మహేష్ బాబు రామ్ చరణ్ లతో పాటు జూనియర్ ప్రభాస్ అల్లు అర్జున్ లు కూడ ఎవరికి వారు సొంతంగా ఆడియో కంపెనీలను త్వరలో ప్రారంభించి వారి సినిమాపాటల పై వచ్చే రాయల్టీని కూడ బయటకు పోనీయకుండా వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: