సినిమా కమర్షియల్ ఫార్మాట్‌లోకి మారిన దగ్గర నుంచి థ్రిల్లర్ సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి. 60లోనే సూపర్‌ స్టార్ కృష్ణ థ్రిల్లర్‌ సినిమాలు టేస్ట్ చూపిస్తే 80లలో మెగాస్టార్‌ కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే థ్రిల్లర్‌ల వైపు కూడా ఓ కన్నేశాడు. అలా తెరకెక్కిన సినిమానే అభిలాష. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కొందడరామి రెడ్డి దర్శకుడు. చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రావు గోపాల్ రావు, రాళ్లపల్లి, గొళ్లపూడి మారుతీ రావు, మాడాలు కీలక పాత్రల్లో నటించారు.

 

ఈ సినిమాలో చిరు ఉరిశిక్షణు రద్దు చేయాలని పోరాటం చేసే ఓ యువ లాయర్‌గా నటించాడు. తన తండ్రిపై చేయని నేరం మోపి ఉరి శిక్ష వేయటంతో అందుకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తుంటాడు. అనుకోకుండా చిరంజీవికి సీనియర్‌ క్రిమినల్‌ లాయర్‌ సర్వోత్తమ రావు (రావు గోపాల్‌ రావు)ను కలిసే అవకాశం వస్తుంది. అయితే ఎలాగైన సర్వోత్తమ రావుకు ఉరిశిక్షను రద్దు చేయించాలన్న తన వాదన వినిపించాలని ఆయన్ను కలిసేందుకు వెళతాడు. అక్కడ కాస్త రసాభాస జరిగినా ఫైనల్‌గా తన ఆలోచనల గురించి చెప్తాడు.

 

సర్వోత్తమ రావు ఆలోచన మేరకు ఓ అనాధ శవం తీసుకోని చిరంజీవి ఆమెను రేప్‌ చేసి హత్య చేసినట్టుగా చిత్రీకరిస్తారు. చివరి నిమిషంలో అసలు విషయం బయట పెట్టి చిరంజీవిని ఉరి శిక్ష నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తారు. కానీ తెల్లరితే చిరంజీవిని ఉరితీస్తారనగా ఆయన్ను కాపాడేందుకు బయలు దేరిన సర్వోత్తమ రావుకు యాక్సిండెంట్ అవుతుంది. ఈ పరిస్థితులు చిరంజీవి పరిస్థితి ఏంటి..? ఉరి నుంచి యువ లాయర్‌ ఎలా తప్పించుకున్నాడు..? అసలు ఈ సినిమాలో విలన్‌ ఎవరు? అన్నదే మిగతా కథ.

మరింత సమాచారం తెలుసుకోండి: