కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థంగా తయారయింది. పనులు లేక ఉపాధి కోల్పోయి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయిన ఇండస్ట్రీలలో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. షూటింగులు ఆగిపోయి నిర్మాతల మీద ఆర్థికంగా బాగా భారం పడింది. అప్పులు తెచ్చి, వడ్డీలు కట్టలేక చితికిపోతున్నారు. దీంతో నిర్మాతలు చూపు ఓటీటీలపై పడింది.

 

తెలుగులో ఇప్పటికే ఓటీటీవైపు చూస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా కీర్తిసురేష్ తన సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తుందట. నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ బయోపిక్ లో ఆమె నటనకి ఉత్తమ జాతీయ నటిగా అవార్డు కూడా గెలుచుకుంది.

 

అయితే మహానటి తర్వాత ఆమె తెలుగులో నటించిన చిత్రాలేవీ లేవు. ప్రస్తుతం నితిన్ సరసన రంగ్ దే చిత్రంలో నటిస్తుంది. అలాగే కొత్త దర్శకుడితో మిస్ ఇండియా సినిమాలో కనిపించనుంది. ఇంకా గుడ్ లక్ సఖి అంటూ మనల్ని పలకరించనుంది. అయితే ఈ చిత్రాలే కాక తమిళంలో తెరకెక్కి, తెలుగులోనూ విడుదలకి సిద్ధమైన పెంగ్విన్ కూడా ఉంది. లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా బాగుంటుందట.

 

పిజ్జా ఫేమ్ కార్తిక్ సుబ్బరాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మరో వారంలో అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. ఇప్పటికే అమెజాన్ తో సంప్రదింపులు జరిగాయట. అమెజాన్ ఈ సినిమాకి మంచి అమౌంట్ నే ఇవ్వనుందట. తమిళనాడులో డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేయడంపై వ్యతిరేకత వస్తున్నా కూడా సూర్య నిర్మాతగా వ్యవహరించిన పొన్ మగల్ వంధాల్ చిత్రంపై పట్టువదలకపోవడంతో అదే ధైర్యంతో కార్తిక్ సుబ్బరాజు ఈ స్టెప్ ని తీసుకున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: