రజని కాంత్ కెరీర్ లో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో ఒకటి రికార్డులు బద్దలు కొట్టిన సినిమాల్లో ఒకటి, నరసింహ. ఈ సినిమా తర్వాత రజని కాంత్ రేంజ్ ఏ స్తాయిలో మారింది అనేది అందరికి తెలిసిన విషయమే. రజని కాంత్ కెరీర్ లో ఈ సినిమా ముందు ఈ సినిమా తర్వాత అనే విధంగా ఈ సినిమా ఉంది అనేది వాస్తవ౦. ఈ సినిమా కోసం రజని కష్టపడిన తీరు రమ్యకృష్ణ చేసిన యాక్షన్ అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరయ్యాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం రజని ఏ విధంగా కష్టపడ్డాడు అనేది ఆ తర్వాత తమిళ పత్రికలూ చాలా కథనాలు రాసాయి. 

 

ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలు సస్పెన్స్ తోనే ఉంటాయి. తర్వాత ఏది జరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది సినిమా. నీలాంభారి గా రమ్య కృష్ణ ఎప్పుడు ఏది చేస్తుంది అనేది కూడా ప్రేక్షకులకు బాగా నచ్చిన అంశం. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు ఒక వినోదాన్ని పూర్తి స్థాయిలో అందించింది. ఇక క్లైమాక్స్ లో ఎం జరుగుతుంది, కూతురు ప్రేమను కాపాడుకోవడానికి గానూ తండ్రి ఎం చేస్తాడు అనేది కూడా ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన అంశంగా చెప్పుకోవచ్చు. అలా ఆ సినిమాలో ఎన్నో సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి అనేది వాస్తవం. 

 

సినిమా తర్వాత రమ్య కృష్ణ రేంజ్ కూడా చాలా వేగంగా పెరిగింది. రజని కాంత్ పక్కన ఆమె చేసిన యాక్షన్ కూడా ప్రేక్షకులను మైమరిపించింది అనేది వాస్తవం. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికి ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాయి. ఈ తరానికి పెద్దగా ఆ సినిమా తెలియదు గాని కిందటి తరానికి ఆ సినిమా అంటే ఒక పిచ్చి అనేది అందరికి తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: