1990లో రిలీజ్ అయిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ కోకిల. సీనియర్‌ నరేష్, శోభన, శరత్‌ బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కు గీతా కృష్ణ దర్శకుడు. అంతేకాదు ఈ సినిమాకు ప్రముఖ కమెడియన్ ఎల్బీ శ్రీరామ్‌ కథా మాటలు అంధించటం విశేషం. తొలి సినిమా తోనే ఎల్బీ శ్రీరామ్‌ కు మంచి గుర్తింపు రావటం తో తరువాత ఆయన రచయిత గా, నటుడి గాను ఆకట్టుకున్నారు. నేత్రదానం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా క్షణ క్షణం ఉత్కంఠ కలిగించే స్క్రీన్‌ప్లే తో ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.

 

కథ విషయానికి వస్తే.. సాదాసీదా గా జీవితం గడిపే నరేష్ శోభన తో ప్రేమలో పడతాడు. శోభన కూడా అతడి ప్రేమను అంగీకరించటం తో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఓ ప్రమాదంలో నరేష్ రెండు కళ్లు పోగొట్టుకుంటాడు. కొద్ది రోజుల తరువాత నేత్రదానం చేసిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన కళ్ల ను నరేష్‌ కు పెడతారు. చికిత్స జరిగిన దగ్గర నుంచి నరేష్‌ ను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తుంటారు. అయితే ముందుగా నరేష్‌ కు అమర్చిన కళ్ల జ్ఞాపకాలు అవి అని భావిస్తారు.

 

అయితే డాక్టర్‌ విషయాన్ని పోలీస్‌ అధికారి శరత్‌ బాబు కు చెప్తాడు. కళ్లకు జ్ఞాపకాలు ఉండవని శరత్‌ బాబు ఈ కేసును పరిష్కరించేందుకు ఓకె చెప్తాడు. అసలు నరేష్‌ ను చంపాలనుకుంటుంది ఎవరు..? నరేష్ కు పెట్టిన కళ్లుకు ఈ హత్యా ప్రయత్నానికి ఏమైన సంబంధం ఉందా..? చివరకు నరేష్‌ కు కళ్లు వచ్చాయా లేదా..? అన్నదే మిగతా కథ. ఈ సినిమా కమర్షియల్‌ గా వర్క్‌ అవుట్ కాకపోయినా.. థ్రిల్లర్‌ సినిమాల్లో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందుకే ఇప్పటికీ టాలీవుడ్‌ లో బెస్ట్ థ్రిల్లర్‌ సినిమాల ప్రస్థావన వస్తే టాప్‌ 5 లో ఉంటుంది కోకిల.

మరింత సమాచారం తెలుసుకోండి: