టాలీవుడ్ లో తక్కువ కాలంలో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న భామ రేష్మీ. తెలుగు బుల్లి  తెర రంగంలో హాట్ ఇమేజ్ తో కుర్ర కారు మ‌న‌స్సు దోచుకున్న రేష్మీ ప్రోగ్రామ్ వస్తుందంటే యూత్ ఎలా క‌ళ్లార‌ప్ప కుండా టీవీలు చూస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క ర్లేదు. రేష్మీకి అతి తక్కువ కాలంలో యూత్ లో మంచి క్రేజ్ అనేది వచ్చింది అనేది వాస్తవం. ఆమె బుల్లి తెర మీద కనపడితే కొందరికి పండగ మాదిరి ఉంటుంది.. టీఆర్పీలు పేలి పోతుంటాయి. కొద్ది యేళ్లుగా ఏ పాపుల‌ర్ షో చూసినా మ‌న‌కు రేష్మీ హంగామాయే కన‌ప‌డేది. 

 

మ‌ధ్య‌లో వెండి తెర మీద సైతం ఓ వెలుగు వెలిగి పోవాల‌ని వ‌చ్చిన రేష్మీ కి ఇక్క‌డ కూడా కాలం క‌లిసి రాలేదు. అయితే ఇప్పుడు ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కడా  కూడా కనపడట౦ లేదు. ఇటీవల ఒక స్టార్ హీరో సినిమాలో ఆమె నటించడానికి గానూ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆమెను మాత్రం తీసుకోవడం లేదని ఆమెను వద్దని మొహం మీదే చెప్పే పరిస్థితి ప్రస్తుతం వచ్చింది అని కొందరు అంటున్నారు. 

 

ఆమె మహేష్ బాబు సినిమాలో చెయ్యాలని, హీరోయిన్ ఫ్రెండ్ గా నటించాలి అని ప్రయత్నం చేసింద‌ట‌. కాని అది సాధ్యం కాలేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఒక పాత్రకు ట్రై చేస్తోందంటున్నారు. అన‌సూయ‌కు రంగ‌స్థ‌లం సినిమాలో వ‌చ్చిన లాంటి పాత్ర కోసం ఇప్పుడు ఆమె ప‌రిత‌పించి పోతోంద‌ట‌. ఇక పుష్ప సినిమాలో పాత్రకు కూడా ఆమెను తీసుకునే అవకాశం కనపడటం లేదు. దీనితో ఆమెలో అసహనం వ్యక్తమవుతోంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

 

ఇక సినిమాల్లో ఫుల్ లెన్త్ రోల్స్‌ గురించి ఆలోచన వద్దని వాటికి దూరం గా ఉండటమే మంచిది అని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. అవకాశాలు ఎవరైనా ఇచ్చినా సరే వద్దని చెప్పే ఆలోచనలో రేష్మీ ఉందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: