ఇంకో 10 రోజులుంటే షూటింగ్ అయిపోయేది. పోస్ట్ ప్రొడక్షన్ పని చకచకా అవ్వగొట్టేసుకుని రిలీజ్ చేసేద్దాం అనుకుని కరోనా దెబ్బకి మూల పడిన పనుల గురించి ఆలోచించుకుంటూ వర్రీ అవుతున్నారు హీరోలు . కరోనా కల్లోలానికి కామన్ పీపుల్ తో సహా ..థియేటర్లు, షూటింగులు ఇలా  పోస్ట్ పోన్ అయిపోయాయి. ఈ దెబ్బతో ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇచ్చిన సినిమాలు వెనక్కి వెళ్లాయి.

 

ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో మంచి టైమ్ చూసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలకు కరోనా షాకిచ్చింది. లాక్ డౌన్ దెబ్బకి వారం రోజుల షూటింగ్ మిగిలున్న సినిమాలు కూడా మళ్లీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.   ఈ లిస్ట్ లో ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాని ఉన్నాడు. ల్రెడీ నాని, సుధీర్ బాబు నటిస్తున్న వి సినిమా మార్చి  లో  రిలీజ్ చెయ్యాల్సి ఉంది. ఇంకా వారం రోజలైతే  సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయేది . కానీ ఈ కరోనా దెబ్బకి షూటింగ్ తో పాటు రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయిపోయిందని నాని తెగ వర్రీ అవుతున్నాడు . 

 

రవితేజ, శ్రుతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న సినిమా క్రాక్. ఈ సినిమా కూడా ఆల్ మోస్ట్ షూటింగ్ అయిపోయి చిన్న చిన్న కరెక్షన్స్ చెయ్యడానికి చూస్తోంది. ఇంకో 10 రోజుల షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోయేది.కానీ ఈ  కరోనా దెబ్బకి ఆ 10రోజుల  షూట్ ఎప్పుడవుతుందా.. రిలీజ్ అయ్యేదెప్పుడా, నెక్టస్ సినిమా తెరమీదెకెళ్లేదెప్పుడా అని ఆలోచిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న రవితేజకు కరోనా మరో సమస్యగా మారింది. మరి ఈ సమస్య నుంచి ఎప్పుడు బయట పడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: