నటరత్న నందమూరి బాలకృష్ణ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్ - కథానాయకుడు' 'ఎన్టీఆర్ - మహానాయకుడు' మరియు 'రూలర్' ఘోర పరాజయాన్ని చవి చూశాయి. దీంతో నందమూరి అభిమానులు నెక్స్ట్ సినిమాలతో మళ్ళీ బాలయ్య ఫార్మ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. 

 

ఈ క్రమంలోనే బాలయ్య - బి.గోపాల్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసుకుందట. ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ రాశారు. అయితే జూన్ 10న బాలయ్య పుట్టినరోజు.. మరి బర్త్ డే స్పెషల్ గా బాలయ్య ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తారా లేదా అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

ఇదిలా ఉండగా బాలయ్య - బి. గోపాల్ లది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో 'లారీ డ్రైవర్' 'రౌడీ ఇన్స్పెక్టర్' 'సమరసింహా రెడ్డి' 'నరసింహ నాయుడు' లాంటి హిట్ చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి. వీరి కాంబోలో 'పలనాటి బ్రహ్మనాయుడు' ఒక్కటే పరాజయం పాలైంది. మరి వీరి కలయికలో రాబోతున్న మరో సినిమా ఎలాంటి విజయాన్ని అందించబోతుందో చూడాలి. కాగా గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ బ్లాక్ బస్టర్‌ అందించిన బోయపాటి శ్రీను ఇప్పుడు మళ్ళీ ప్లాపుల్లో ఉన్న బాలయ్యని గట్టెక్కిస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ఈ చిత్రంతో బాలయ్య - బోయపాటి శ్రీను హాట్రిక్ హిట్ సాధించి బాలయ్య మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: