యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఓంకార్ ఆ తరువాత ఓక్ ఎంటర్‌టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి రియాలిటీ షోలు చేయ‌డం మొద‌లు పెట్టారు. నెమ్మ‌దిగా ఎదుగుతూ సినిమాల‌ను నిర్మించి నిర్మాత‌గా మారారు. ఇక ఆయన నిర్మించే చిత్రాల‌కు ఆయనే ద‌ర్శ‌కుడుగా మారి త‌న త‌మ్ముడు అశ్విన్‌బాబుని హీరోగా పెట్టి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ల‌ను తెర‌కెక్కిస్తున్నారు ఓంకార్‌. ఇక `రాజుగారి గ‌ది` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తాను చాటాడు. ఓ మంచి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను తీసుకుని చాలా చ‌క్క‌గా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం `రాజుగారిగ‌ది` ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో ధ‌న్య‌బాల‌కృష్ణ‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

 

ఈ చిత్రం ఇటు కామెడీతో పాటు చివ‌రి వ‌ర‌కు కూడా ద‌ర్శ‌కుడు మంచి స‌స్పెన్స్‌ని మెయిన్‌టెయిన్ చేశాడు. మొద‌టి చిత్ర‌మ‌యిన‌ప్ప‌టికీ దీన్ని చాలా చ‌క్క‌గా చిత్రాక‌రించాడు ద‌ర్శ‌కుడు. ఇక ఈ చిత్రంతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌నే కాక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌గా తీశారు. ఓ మెడిక‌ల్ ల్యాబ్‌లో మ‌నిషి అవ‌య‌వాల‌తో జ‌రిగే కొన్ని రీసెర్చ్‌ల పై ఎలాంటి నీచాల‌కి కొంద‌రు పాల్ప‌డ‌తారు. అన్న విష‌యాల‌ను ఈ చిత్రంలో చూపించాడు. బ్ర‌తికుండ‌గానే మ‌నిషిని చంపేసి వాడి అవ‌య‌వాల‌తో మెడిక‌ల్ రీసెర్చ్‌లు జ‌రుపుతుంటారు. ఈ విష‌యం తెల‌సుకున్న రాజీవ్ క‌న‌కాల‌ను సైతం చంపేస్తారు. అది చివ‌రి వ‌ర‌కు కూడా ఎవ్వ‌రికీ అర్ధం కాదు. 

 

అశ్విన్‌కి అన్న పాత్ర‌లో రాజీవ్ న‌టిస్తాడు. వీరంతా కూడా ఏదో ఒక పందెంలా కాసుకుని ఒక బావి ద‌గ్గ‌ర‌కు ఐదుగురు వ‌స్తారు. అక్క‌డ  ఉండే ఒక సీక్రెట్ గ‌దిలో ఈ కార్య‌క‌లాపాల‌న్నీకూడా జరుగుతుంటాయి. దీన్ని ఈ చిత్రంలోని హీరో అశ్విన్ క‌నిపెడ‌తాడు. అది ఆఖ‌రి వ‌ర‌కు కూడా ఎవ్వ‌రూ క‌నిపెట్ట‌లేని విధంగా ద‌ర్శుకుడు క‌థ‌ని తీస‌కువ‌స్తాడు. ఓ ప‌క్క మంచి కామెడీని చూపిస్తూనే స‌స్పెన్స్‌ని కూడా క్రియేట్ చేస్తాడు. ఈ చిత్రం మంచి హిట్ కావ‌డంతో దీని త‌ర్వాత వీటి సీక్వెల్‌గా మ‌రో రెండు చిత్రాల‌ను కూడా తీశాడు ఓంకార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: