టాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలు అలా ఉండిపోతు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా శోభన్ బాబు హీరో గా వచ్చిన... దేవత సినిమా. దేవత సినిమా ద్వారా అప్పటి వరకు ఒక శోభన్ బాబు ని ప్రేక్షకులు చూస్తే ఆ సినిమా తర్వాత మరో శోభన్ బాబుని ప్రేక్షకులు చూసారు. ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి అనేది వాస్తవం. ఆ సినిమా ఇప్పటికి టీవీ లో వస్తున్నా సరే ప్రేక్షకులు చూస్తారు అనే సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా చెప్పుకునే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. 

 

విలన్ గా నటించిన మోహన్ బాబు నటన అతనిని శ్రీదేవి వివాహం చేసుకోవడం అతని ద్వారా ఒక బాబుని కనడం ఒక సంచలనం అయితే ఆ సినిమాలో జయప్రద నటన కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. శోభన్ బాబు ని వీరు ఇద్దరు ప్రేమిస్తారు. ఆయన తో ఇద్దరూ కూడా జీవితం పంచుకోవాలి అని అనుకుంటారు. కాని వారు ఇద్దరిలో ఎవరికి శోభన్ బాబు ధక్కుతాడు అనేది సినిమాలో ఒక సస్పెన్స్. ఆ సినిమాలో వారిద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ఇక ఆ సినిమాలో శోభన్ బాబు ని తాము ఇద్దరూ ప్రేమించిన విధానం ఒకరితో ఒకరు చెప్పుకున్న విధానం దర్శకుడు ఆ సన్నివేశాలను ప్రేక్షకులకు అందించిన విధానం ఎంత గానో ప్రేక్షకులకు నచ్చాయి అనేది తెలిసిందే. 

 

సినిమా తర్వాత శోభన్ బాబు రేంజ్ చాలా పెరిగింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాలో ఆయన నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. సస్పెన్స్ ని ఈ సినిమా బాగా అందించింది. మోహన్ బాబు నటన చూసిన ప్రేక్షకులు అయితే ఆ సినిమా తఃర్వాత అతని మీద కోపం కూడా పెంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: