ఇప్పటికే ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని సినిమాల్లో మాత్రం ప్రేక్షకుల ఊహకందని విధంగా ట్విస్ట్  ఉంటుంది.ఆ ట్విస్ట్ లతో ప్రేక్షకులు షాక్  కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సినిమాల్లో ఒకటి ఎక్కడికి పోతావు చిన్నవాడా. యువ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో హెబ్బా పటేల్ నందిత శ్వేత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నిఖిల్ కెరీర్లో మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. త్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు విఐ.ఆనంద్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఆనంద్ సినిమాలు అంటే మంచి సస్పెన్స్ తో   ఉంటాయి అన్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే విఐ ఆనంద్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. అందుకే ఎక్కడ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఓవైపు కామెడీని పంచుతూ కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు... సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరిస్తూ ఉంటాడు. సినిమాలో  నిఖిల్ హెబ్బా పటేల్ నందిత శ్వేత తమ తమ పాత్రలతో అదరగొట్టాడు అనే చెప్పాలి. ఇక సస్పెన్స్ త్రిల్లర్ ఏమిటి అంటే మరో హీరోయిన్ అవికా గోర్. నిఖిల్ కాలేజీ చదువుతున్న సమయంలో అవికా గోర్ నీ పెళ్లి చేసుకోవాలని భావిస్తారు కానీ పెళ్లి చేసుకునే సమయానికి అవికా గోర్ యాక్సిడెంట్ ద్వారా చనిపోతుంది ఆ విషయం నిఖిల్ కు  తెలియదు.. 

 

 

 ఆ తర్వాత రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి. నిఖిల్ ఫ్రెండ్ అయినా వెన్నెల కిషోర్ కు బాగూ  చేయడానికి ఒక భూత వైద్యుని దగ్గరకు తీసుకెళతాడు నిఖిల్. అదే సమయంలో హెబ్బా పటేల్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత... తనతో ప్రేమలో పడింది హెబ్బా పటేల్ కాదు తనలో ఉన్న మరో ఆత్మ అని తెలుస్తుంది . ఇది తెలిశాక  ఇంటికి వచ్చేస్తాడు హీరో..తర్వాత నందిత శ్వేతా  బాడీ లోకి వెళ్ళిన ఆత్మ మళ్లీ నీఖిల్  దగ్గరకు చేరుకుంటుంది . ఇక చివరిలో ట్విస్ట్ ఏమిటి అంటే ఆత్మ ఎవరిదో కాదు అంతకు ముందు నిఖిల్  ప్రేమించిన అవికాగోర్ ది.  ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: