అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా గా చెప్పుకునే సినిమా ఒకటి ఉంది. అది ఏంటీ అంటే జులాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా అతని కెరీర్ లో ది బెస్ట్ సినిమా గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత అతని రేంజ్ చాలా వరకు పెరిగింది కూడా. ఇక ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అది ఏంటీ అంటే కొన్ని కొన్ని సన్నివేశాలు తర్వాత ఎం జరుగుతాయి అనే విధంగా ఉంటాయి. ముఖ్యంగా సోనూ సూద్ డబ్బులు కొట్టేయడమే కాకుండా కోటా శ్రీనివాసరావు డబ్బులను దాచి ఉంచడం, 

 

ఏసీపీ గా ఉన్న రావు రమేష్ నటన కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. వాళ్ళు డబ్బు దాచి ఉంచడం సోనూ సూద్ ని దేశం దాటించాలి అని ప్రయత్నాలు చేయడం అతనిని పట్టుకోవడానికి గానూ అల్లు అర్జున్ సహకారం తీసుకోవడం తన ఫ్యామిలీ ని కాపాడుకోవడానికి గానూ అల్లు అర్జున్ చేసిన ప్రయత్నం అన్నీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి అనేది అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన ఒక హైలెట్ అయితే సీన్ లు రాసిన దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం కూడా ఒక హైలెట్ గా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఆ సినిమా ప్రేక్షకులకు ఏ విధంగా వెళ్లిందో తెలుసుకోవచ్చు. 

 

ఆ సినిమాను  ఇప్పటికి టీవీ లో వస్తే ప్రేక్షకులు చూస్తూ ఉంటారు అనేది వాస్తవం. ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలకు అవార్డులు కూడా ఇచ్చుకోవచ్చు అని కొందరు అంటూ ఉంటారు. ఆ విధంగా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకు౦ది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: