క్షణం... ఈ సినిమా ఎంత బాగుంది అసలు.. ట్విస్టులు.. లవ్.. యాక్షన్ అన్ని అద్భుతం అంతే.. అడవి శేష్ అంటే ఎవరు అనేది ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా క్షణం.. మనం ఒకరికి మాటా ఇస్తే చాలు.. ఆ మాటా ఎలాంటి పరిస్థితిలో అయినా నిలబెట్టుకోవాలి అనే ఒక చిన్న లైన్ పై ధ్రిల్లింగ్ స్టోరీతో అదరగొట్టారు అంటే నమ్మండి.. 

 

ఒక అమ్మాయిని ప్రేమించడం.. వాళ్ళ నాన్న వల్ల విడిపోవడం.. ఆతర్వాత ఆమెకు పెళ్లి.. హీరో ఫారిన్ కి ఇవి అన్ని కామన్.. కానీ ఆ తర్వాత జరిగే కథే కొంచం కొత్తగా.. వింతగా ఉంటోంది.. థ్రిల్లింగ్ ఉంటుంది.. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆమె ఫోన్ చెయ్యడం.. పాపా కనిపించడం లేదు అనడం.. పాప కోసం తిరిగి రావడం ఇలా అన్ని జరుగుతాయి.. 

 

ఇంకా పాపను వెతికే సమయంలో జరిగేవి అన్ని ఒకొక్కటి ఒక్కో షాక్ ఇస్తాయి.. అనసూయ ఎంతో మంచిది అనుకుంటే అనసూయనే సినిమా మొత్తానికి విలన్ అని తెలుస్తుంది.. హీరోయిన్ చనిపోతుంది.. పాప కోసమే చస్తుంది... అనసూయని చంపేస్తాడు.. పాప వస్తుంది.. అప్పుడే ట్విస్ట్.. పాప అతని కూతురే అని.. అసలు ఆ ట్విస్ట్ ఎవరు ఊహించనిది.. 

 

ఇంకా ఆ సినిమాతోనే అడవి శేష్ పేరు బాగా ఫేమస్ అయిపోయింది.. అడవి శేష్ సినిమాల కోసం ఎదురు చూసేలా అయ్యింది.. అడవి శేష్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ మనకు దొరకడం అరుదు.. ఇంకా అతని సినిమాలను చూసుకొని థ్రిల్లర్ సినిమాలు అంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు అడవి శేష్.  

మరింత సమాచారం తెలుసుకోండి: