తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నా ఆ దర్శకుడుకి  మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ ఆ దర్శకుడు . ఏ హీరోతో సినిమా తీసిన పవర్ఫుల్ హీరోయిజాన్ని చూపిస్తూ... అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఉంటాడు ఆ దర్శకుడు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన సినిమాలను  తెరకెక్కించి మంచి గుర్తింపు  అందుకున్నారు.  ఆ దర్శకుడు ఎవరో కాదు బోయపాటి శ్రీనివాస్. అయితే బోయపాటి శ్రీను తన కెరీర్ని భద్ర సినిమాతో  ప్రారంభించిన విషయం తెలిసిందే. 

 

 

 అప్పట్లో బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర  ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటన,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బోయపాటి శ్రీను దర్శకత్వం తెలుగు ప్రేక్షకులు అందరిని మెప్పించడం తో భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. కాగా ఈ సినిమా మే 12వ తేదీన విడుదల అయింది. అంటే సరిగ్గా ఇదే రోజున దర్శకుడిగా బోయపాటి శ్రీను కు పునాది పడింది అని చెప్పాలి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో బోయపాటి శీను ఒక ప్రత్యేకమైన ఇమేజ్. ఇక అటు రవితేజ కెరీర్ కి కూడా భద్ర సినిమా విజయం ఎంతగానో కలిసొచ్చింది. 

 

 

 వాస్తవంగా అయితే భద్ర సినిమా రవితేజ తో తీయాలి  అనుకోలేదట  బోయపాటి శీను.  అల్లు అర్జున్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. అందుకే మొదట బన్నీకి ఈ కథ వినిపించాడట  బోయపాటి శ్రీను.బన్నీ కి  కథ తెగ నచ్చేసింది కూడా... కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క రీసన్ చెప్పాడట బోయపాటికి . అప్పటికి కేవలం గంగోత్రి ఆర్య సినిమాలు మాత్రమే చేసిన అల్లు అర్జున్ తనకు  ఇంత మాస్ ఎమోషన్ మోసే  అనుభవం లేదు అని చెప్పడంతో.. ఆ తర్వాత ఈ కథ రవితేజ వరకు వెళ్ళింది. ఇక్కడి నుంచి బోయపాటి సినీ ప్రస్థానం మొదలైంది. తర్వాత తులసి సింహా చిత్రాలతో టాలీవుడ్ లో  పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు బోయపాటి శ్రీను.

మరింత సమాచారం తెలుసుకోండి: