మెగాస్టార్ సోషల్ మీడియాలో అడుగుపెట్టి తనదైన శైలిలో పోస్టులు పెడుతూ అందర్నీ అలరిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా చిరు ఒక మహిళా పోలీస్ ఉద్యోగి చేసిన పనిని మెచ్చుకుంటూ ఒక పోస్ట్ పెట్టారు. దేశ వ్యాప్తంగా ఓ మహిళా పోలీస్ ఎస్సై చేసిన పని మెగాస్టార్ చిరంజీవిని ఎంతగానో కదిలించింది. లాక్‌ డౌన్‌తో అన్ని స్తంభించిపోయి కొందరికి పట్టెడు అన్నం పెట్టేవాళ్లు కూడా కరువయ్యారు. ఇదే సమయంలో ఒడిశాలోని ఒక మహిళా పోలీస్ అధికారి వృద్ధ మహిళలకు స్వయంగా అన్నం తినిపించింది.. మతిస్థిమితం లేని, దివ్యాంగులైన వృద్ధ మహిళలకు ఆమె స్వయంగా అన్నం తినిపించారు. ఆమె ఒడిశాలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ సుభశ్రీ నాయక్. ఆ వీడియో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ఆ వీడియోలు చూసిన చిరంజీవి చలించిపోయారు. ఆమెతో ఎలా అయినా మాట్లాడాలని ప్రయత్నించారు. మొత్తానికి పోలీస్ శాఖ సహకారంతో సుభశ్రీతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మెగాస్టార్. ఆమె ఆ వృద్ధులపట్ల చూపించిన ప్రేమను కొనియాడారు. ఇంత గొప్ప సేవ చేస్తోన్న సుభశ్రీని తప్పకుండా ఆ దేవుడి దీవిస్తాడని ఆశీర్వదించారు. అంతేకాదు ఇలా సామాజిక సేవను కొనసాగించాలని ప్రోత్సహించారు చిరంజీవి. సుభశ్రీతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి. 

 

మెగాస్టార్ ఆమెతో మాట్లాడుతూ.. ''శుభశ్రీ జీ కొన్ని రోజుల క్రితం మీ వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది.. అందులో మీరు ఓ మతి స్థిమితం లేని మహిళకి భోజనం తినిపిస్తున్నారు. అది నా మనసుని తాకింది. నన్ను చలింపజేసింది. ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నాను. మీరు ఆ వ్యక్తి పట్ల అంత ఆదరణగా, మానవీయంగా ఉన్నందుకు  చాలా సంతోషించాను. ఎంతో బాధ్యతగా మీరు ఈ పని చేయడానికి కారణమేంటీ? అని ప్రశ్నించారు. ''నేను ఆవిడకి ప్రత్యేకించి ఏమీ చేయలేదు సర్... నేను భోజనం అందించినప్పుడు ఆవిడ తినే పరిస్థితుల్లో లేదు. దీంతో నేను ఆమెకు తినిపించాను'' అని సమాధానం ఇచ్చిందామె. ''మీరు చాలా మందికి స్ఫూర్తివంతంగా నిలిచారు'' అంటూ చిరు ప్రశంసించగా.. బాధ్యతలు నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్‌ కాపాడడం మాత్రమే కాదు.. పౌరుల‌కి ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చిన స‌హాయ‌ప‌డ‌టం మ‌న క‌ర్తవ్యం . దీనిని రివార్డ్‌గా భావిస్తాను. మీరు.. నాతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారు అని చెప్పగానే చాలా ఉద్వేగం పొందాను. మీరు నాతో మాట్లాడుతుండడంతో చాలా సంతోషంగా ఉంది. మీరు మెగాస్టార్ మాత్రమే కాదు.. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సెమినార్స్‌లో పాల్గొన్నారు అంటే చిరంజీవి సేవా కార్యక్రమాలను ప్రస్తావించారమె.. ఇక, మీరు ఇలాంటి గొప్ప ప‌నులు ఎన్నో చేయాలి. మీతో మాట్లాడ‌డం సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ అంటూ చిరు త‌న సంభాష‌ణ ముగించారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు మెగాస్టర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: