టాలీవుడ్ లో ఎవరైనా సెన్సేషనల్ తార ఉన్నారు అంటే అది స్వాతి నాయుడు అనే చెప్పాలి. అయితే స్వాతి నాయుడు సెన్సేషన్ సృష్టించినది  సినిమాలతో కాదు. శృంగార తారగా. బి గ్రేడ్  శృంగార వీడియోలలో  నటించిన  స్వాతి నాయుడు.. కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో ఏకంగా నెటిజన్లు అందరికీ శృంగార పాఠాలు చెబుతూ సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. శృంగారం లోని మేలుకువలెన్నింటినో  నెటిజన్లకు నేర్పుతూ అందరికీ సుపరిచితులు గా మారిపోయింది స్వాతి నాయుడు. అలాంటి శృంగారతార స్వాతి నాయుడు పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

 2019లో స్వాతి నాయుడు తను ప్రేమించిన అవినాష్ ను వివాహం చేసుకుంది. ఇక అప్పటి నుంచి స్వాతి నాయుడు తన భర్తతో ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని గడుపుతుంది.. అంతే కాదు  తన పెళ్లి శృంగారం గురించి కూడా బహిరంగంగా మాట్లాడి సంచలనమే సృష్టించింది. ఇక పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ని కొనసాగిస్తుంది స్వాతి నాయుడు. అయితే కొద్ది రోజుల క్రితమే శ్రీమంతం జరుపుకుంది స్వాతి నాయుడు.  లాక్ డౌన్  కారణంగా నిరాడంబరంగా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే శ్రీమంతం జరుపుకుంది స్వాతి నాయుడు. కాగా సోమవారం తెల్లవారుజామున స్వాతి నాయుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

 

 

 దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక స్వాతి నాయుడు పండంటి  బిడ్డకు జన్మనివ్వడం తో ప్రస్తుతం అందరూ స్వాతి నాయుడు కు  శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పట్లో  తన భర్త తాము  పిల్లలు వద్దనుకునప్పటికి...  తమ కుటుంబ సభ్యులు పిల్లలు కావాలనటంతో  వారి కోరిక కాదనలేక తల్లిని అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. మా  ప్రేమకే ప్రతి రూపమే ఈ చిన్నారి అంటూ తెలిపింది  స్వాతి నాయుడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: