దాంతో ఆ సినిమాలు అలా ఆగిపోయాయి. కానీ సినిమాల ప్రమోషన్ కోసం రిలీజ్ చేసిన సాంగ్స్ మాత్రం అదరగొడుతున్నాయి. అసలే లాక్ డౌన్. కొత్త అన్న వూసు లేదు. అంతా పాత సరుకే. దాంతో గడచిన రెండు నెలల్లోనూ ఈ సినిమాల్లోని పాటలు టీవీల్లో మోత మోగిస్తున్నాయి. జనాలు వీటికి బాగా కనెక్ట్ అయిపోతున్నారు. వ్యూస్ చూస్తే టాప్ హీరోల సాంగ్స్  రికార్డులను తిరగరాస్తున్నాయి.

 

ఆ రెండు మూవీలో ఒకటి సాయి ధరం తేజ్ తమ్ముడు వైభవ్  తేజ్ నటించిన డెబ్యూ మూవీ ఉప్పెన. ఇందులో సాంగ్ నీ కన్ను నీలి సముద్రం అయితే లిజనర్స్ కి  గొప్ప రిలీఫ్ ఇస్తోంది. ఎన్ని సార్లు ప్రోమో చూస్తున్నారో కూడా అర్ధం కావడంలేదు. ఈ మూవీలో కీర్తి శెట్టి హీరోయిన్ గా ఉంది. ఆ అమ్మడు తొలి సినిమాతోనే అందరికీ ఆకట్టుకుంది. ఇక సాహిత్యం. సంగీతం పోటీ పడ్డాయి.

 

అదే విధంగా మరో మూవీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ మూవీ హీరో ప్రముఖ యాంకర్ ప్రదీప్ డెబ్యూ మూవీలో నీలి నీలి ఆకాశం సాంగ్ కూడా అదిరిపోయింది. ఈ సాగ్ సిద్దూ శ్రీరాం సునీత పాడారు. ఈ మూవీ ప్రోమోలో వస్తున్న ఈ సాంగ్ కూడా టీవీ వ్యూయర్స్ ని కట్టిపడేస్తోంది. ఈ మూవీ ఎపుడు చూస్తామా అన్న ఫీలింగ్ కలిగిస్తోంది.

 

మొత్తం మీద రెండు సినిమాలు ఇంకా విడుదల కాలేదు కానీ సాంగ్స్ మాత్రం అదరహో అంటున్నాయి. నిజంగా ఇది రికార్డేనని అంటున్నారు. మరి సినిమాలు రిలీజ్ అయితే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి. ఈ ఇద్దరు హీరోల్లో మంచి ఈజ్ ఉంది. ఇక హీరోయిన్లకు కూడా మంచి ఫ్యూచర్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. లాక్ డౌన్ తరువాత వారి లక్ ఏంటన్నది ఆడియన్స్ డిసైడ్ చేయాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: