తెలుగు బుల్లి  తెరపై యాంకర్ విష్ణుప్రియ ఎంతగానో  క్రేజ్ సంపాదించిన విషయం తెలిసిందే. సుడిగాలి సుదీర్ కు  జోడిగా ఈటీవీ ప్లస్ లో వచ్చే పోవే పోరా కార్యక్రమం ద్వారా విష్ణుప్రియ ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఈ టీవీ కి సంబంధించిన అన్ని ప్రోగ్రాంలో విష్ణుప్రియ కనిపిస్తోంది. ఇక ప్రతి విషయంలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్గా దూసుకుపోతుంది విష్ణుప్రియా . కేవలం బుల్లితెరపై షోల ద్వారానే కాదు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను మరింతగా ఆకర్షిస్తుంది ఈ అమ్మడు. 

 

 

 అయితే ప్రస్తుతం లాక్ డౌట్  కారణంగా సినీ సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో.. అందరూ సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగానే విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు లాక్ డౌన్  సమయం మొత్తం సోషల్ మీడియాకు  కేటాయిస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకుంటూ వస్తుంది. 

 

 

 ఈ క్రమంలోనే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అనే ప్రశ్న అభిమానుల నుంచి విష్ణుప్రియకు  ఎదురైంది. దీని గురించి చెబుతూ విష్ణు ప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఇంకో నాలుగేళ్ల తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఓ మహిళ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి అంటే ఎంతో మెచ్యూరిటీ కావాలని..  తనకు ఇంకా రాలేదు అని తాను అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక అంతే కాకుండా తన కాబోయే వాడు ఎలా ఉండాలి అనుకుంటుందో కూడా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ . కాబోయే వాడికి ఎంతో ఓర్పు ఉండాలని... అంతే కాకుండా చూడటానికి అందంగా పొడుగ్గా  ఉండాలి అంటు తెలిపింది. పొడుగ్గా ఉండే కుర్రాళ్లు అంటే  తనకు ఎంతో ఇష్టమని... చూడగానే చెమటలు పట్టించేంత  హాట్ ఉంటే  తనకు మరింత ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. అలా ఎవరైనా హాట్ గా కనిపించారంటే వెంటనే వెళ్లి యువర్ సో హాట్ అంటూ చెప్పేస్తాను  అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: