సౌత్ ఇండియా సినిమా రంగంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని బాగా ప్రభావితం చేసిన సినిమాలు 'బాహుబలి' ఆ తర్వాత  ‘కెజిఎఫ్’. ఈ రెండు సినిమాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాయి. 'బాహుబలి' సినిమా ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో అదిరిపోయే విజయాన్ని సాధించింది. ‘కెజిఎఫ్’ చాప్టర్ వన్ అయితే 'బాహుబలి' రేంజ్ లో ఇండియా లో అదిరిపోయే విజయాన్ని సాధించింది. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సింపుల్ గా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సృష్టించింది. ఒక్క కన్నడం లోనే కాదు మిగతా ఇండస్ట్రీలలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటువంటి సమయంలో త్వరలో విడుదల కాబోతున్న ‘కెజిఎఫ్’ చాప్టర్ 2 గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

అనుకున్నదాని ప్రకారం అయితే ఈ ఏడాది అక్టోబర్ 23 వ తారీఖున సినిమా రిలీజ్ కావాల్సివుంది. అని అనుకోకుండా కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ మొత్తం వాయిదా పడ్డాయి. సినిమా మొత్తానికి చూసుకుంటే దాదాపు టెన్ పర్సంటేజ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. మొత్తంగా ఒక నెల రోజుల్లో షూటింగ్ మొత్తం అయిపోతుందని అందుతున్న సమాచారం.

 

ఎందుకంత టైం అని తెలుసుకోగా.. కెజిఎఫ్ చాప్టర్ 2 లో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ కోసమని అది కూడా యష్సంజయ్ దత్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అని అంటున్నారు. సినిమా మొత్తానికి ఇదే హైలెట్ సీన్ అని అందుకోసమే చాలా జాగ్రత్తగా ఈ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నాం అట్లు సినిమా యూనిట్ తెలిపింది. ఈ సన్నివేశం చూసిన ప్రతి ప్రేక్షకుడు మళ్లీ మళ్లీ థియేటర్లకు ఎగబడతారు చూస్కోండి అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: