టాలీవుడ్ లోని హీరోలందరిలో నటనకు సంబంధించి ఏదొక ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని టాలీవుడ్ లో తన రేంజ్ లో హవా సాగిస్తున్నాడు. సరైన కంటెంట్ ఉన్న సినిమా పడితే తనలో యాక్టింగ్ లెవల్స్ ఎలా ఉంటాయో ఇస్మార్ట్ శంకర్ తో నిరూపించాడు. ప్రస్తుతం రెడ్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్న రామ్ మే15న తన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్ కు ఓపెన్ లెటర్ రాశాడు.

 

 

‘ఫ్యాన్స్ గా మీరంతా నా మీద చూపించే ప్రమకు నా మనసులో ఎప్పటికీ స్థానం ఉంటుంది. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుని మీరెంతో సంబరంగా జరుపుకునే తీరు నాకెంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. నాపై చూపే ప్రేమకు అంతకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. మీ ఆరోగ్యం, సంతోషమే నాకు ముఖ్యం. మీరే నా సంతోషం, నా ఎనర్జీ, ప్రాణం.. అంతకుమించి నా బాధ్యత. ప్రస్తుత విపత్కర పరిస్థితుల రీత్యా  ఈసారి నా పుట్టినరోజు వేడుకలకి మీరంతా దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం అందరికీ శ్రేయస్కరం. ఈసారి మీరు పాటించే దూరమే నాకిచ్చే అసలైనన పుట్టినరోజు కానుకగా భావిస్తాను.. మీ రాపో’ అని రాశాడు.

 

 

ఇస్మార్ట్ శంకర్ తో రామ్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇస్మార్ట్ విజయంతో ఫ్యాన్స్ అంతా రామ్ పుట్టినరోజుని ఘనంగా జరుపుకునేవారే. కానీ.. ప్రస్తుత కరోనా పరిస్థితులు ఎటువంటి సంబరాలకు అవకాశం ఇవ్వకుండా చేసింది. ఇందులో రామ్ పుట్టినరోజు కూడా కలిసిపోయింది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇటివల రామ్ లుక్ కూడా రివీల్ అయింది. క్యూట్ లవర్ బాయ్ గా రామ్ ఆకట్టుకున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: