టాలీవుడ్ లో సేవా కార్యక్రమాల విషయంలో సమంతా ఏ విధంగా దూకుడు చూపిస్తుందో అందరికి తెలిసిన విషయమే. ఆమెకు మంచి మనసు ఉంది అని కొందరు అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ మంచి మనసు తోనే ఆమె కొన్ని సేవా కార్యక్రమాలకు సిద్దమవుతుంది. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న కుటుంబాలు అయితే ఆర్ధికంగా ఏ స్థాయిలో నాశనం అయిపోయాయి అనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే ఇప్పుడు వారికి అండగా నిలబడాలి అని ఆమె ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. 

 

ఎవరు అయితే చిన్న పిల్లలను పోషించుకోలేని స్థితి లో ఉన్నారో మురికి వాడల్లో వారిని గుర్తించి ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేయడానికి ఆమె సిద్దమైంది. కొన్ని కుటుంబాలను ఆమె ఎంపిక చేసి వారికి తాను నెల వారి ఇంత నగదు అని ఇవ్వడమే కాకుండా వాళ్లకు కొన్ని తరగతుల వరకు విద్యను తానే చూసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ స్కూల్స్ లో వాళ్ళు చదువుకున్నా సరే వాళ్లకు అన్ని విధాలుగా తాను సహాయ సహకారాలను అందించాలి అని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. 

 

భర్త తో కలిసి ఈ కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉంది అని టాలీవుడ్ లో టాక్. ఆమె ఇప్పుడు ఈ మేరకు ప్రయత్నాలను కూడా మొదలు పెట్టారు అని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోలు కూడా ఇదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి తో కలిసి తాను ఈ ప్రయత్నాలను చేసే ఆలోచన సమంతా చేస్తుంది అని తెలుస్తుంది. త్వరలోనే ఈ మేరకు ఒక ప్లాన్ సిద్దం చేసి ఆమె జనాల్లోకి వెళ్ళాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: