పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు. పవన్ వకీల్ సాబ్ సెట్స్ మీద ఉంది. ఆ తరువాత క్రిష్ డైరెక్షన్లో మూవీ ఉంది. ఈ సందడి ఇలా ఉండగానే పవన్ హరీష్ శంకర్  కి ఓకే చెప్పేశారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్. ఇపుడు అదే కాంబో రిపీట్ కాబోతోంది. 

 

దాంతో ఫ్యాన్స్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ మూవీ కోసం పక్కా మాస్ మసాలా స్టోరీని హరీష్ రెడీ చేశాడని అంటున్నారు. ఇక ఈ మూవీలో పవన్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అన్న దాని మీద కూడా హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. పవన్ పక్కన మళయాళ బ్యూటీని సెలెక్ట్ చేసినట్లుగా ఇపుడు ప్రచారం సాగుతోంది.

 

ఈ మూవీలో మానస్ రాధాక్రిష్ణ‌న్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఈ అమ్మడు కేరళ కుట్టీ. దుబాయిలో పెరిగిన ముద్దుగుమ్మ. ఇప్పటికీ పది మళయాళ సినిమాలు చేసి హాట్ బ్యూటీ అనిపించుకుంది. ఆమెని తెలుగులో పరిచయం చేస్తూ పవన్ పక్కన హీరోయిన్ని చేద్దామన్న హరీష్ శంకర్ ప్లాన్ ఫలించిందట. ఆమె ఓకే చెప్పేసిందట.

 

ఓ మంచి ముహూర్తం చూసుకుని ఆమె పేరు అధికారికంగా ప్రకటిస్తారట. ఈ యంగ్ బ్యూటీ కనుక పవన్ పక్కన నటించి ఆ మూవీ సూపర్ హిట్ అయితే టాలీవుడ్లో మరో మళయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చినట్లేనని అంటున్నారు. ఇప్పటికీ టాలీవుడ్ కి వాళ్ల తాకిడి ఎక్కువగా ఉంది. మరి మానస తెలుగు కుర్రకారు మనసు ఎలా దోచుకుంటుందో చూడాలి.

 

ఇంతకీ ఈ అమ్మడు ఏజ్ కేవలం 21 ఏళ్ళే. ఇపుడే టీనేజ్ నుంచి ఎదిగి వచ్చి వెండి తెరను బంగారం చేస్తోంది. తన పదునైన పరువాలతో మళయాళంలో మతులను పోగెట్టేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: