టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున గురించి తెలియనివారు ఎవరుంటారు చెప్పండి.. నాగ్ కేవలం రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా కింగే. 'విక్రమ్' సినిమాతో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు నాగార్జున. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ఆఖరి పోరాటం' ఘన విజయంతో హీరోగా స్థిరపడ్డారు. ఆ తర్వాత మణిరత్నం 'గీతాంజలి.. రామ్ గోపాల్ వర్మ 'శివ' వరస విజయాలతో స్టార్ ఇమేజ్ సంపాయించుకున్నారు. 'గీతాంజలి' తో లవర్ బాయ్ గా ఆకటుకున్న నాగార్జున, 'శివ' సినిమాతో తెలుగు సినిమా స్థితిని మార్చి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్ .. వంటి  సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఆకర్షించారు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందారు.  తెలుగు సినిమా గురించి తెలిసిన ప్రతి హీరోయిన్ నాగార్జున తో ఒక్కసారి అయిన నటించాలి అని ఉటుంది అని అనటంలో అతిశయోక్తి లేదు. నాగార్జున తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ మరియు హిందీ బాషలలో కూడా నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు. వాటిలో బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తెరకెక్కించిన 'క్రిమినల్' మూవీ గురించి చెప్పుకోవాలి.

 

తెలుగు హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమాలో నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని క్రియేటివ్ కమెర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు మరియు మహేష్ భట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 1994లో తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా హిందీ వర్షన్ 1995లో రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలై 25 ఏళ్ళు దాటిపోయినా ఈ సినిమా పాటలు ఇప్పటికి వింటూనే ఉంటారు. ముఖ్యంగా 'తెలుసా మనసా' సాంగ్ ఇప్పటి కుర్రకారు కూడా విని ఎంజాయ్ చేస్తుంటారు. కాగా ఈ సినిమా హిందీ వర్షన్ 'తూ మిలే దిల్ ఖిలే' సాంగ్ బాలీవుడ్ సింగర్ అనూప్ శంకర్ మరోసారి తన గాత్రంతో వినిపించారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియాజేస్తూ ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చి 25 ఏళ్లవుతోంది. అనూప్ శంకర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి లకు కృతజ్ఞతలు. అనూప్ ఈ సాంగ్ సమాజానికి నిస్వార్ధంగా సేవ చేస్తున్నవారికి డేడికేట్ చేయడం సంతోషించదగ్గ విషయం అని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: