ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన సినిమా " వి ". ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. నివేదా థామస్, అదితీ రావు హైదరీ నాని సుధీర్ లకి జంటగా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమాలో నాని నెగిటివ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. గతంలోను ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నాని నటించిన జెంటిల్ మాన్ సినిమాలో నాని నెగిటివ్ రోల్ లో కనిపించాడు. అయితే అది పక్కా నెగిటివ్ రోల్ కాకపోవడం పైగా నాని డ్యూయల్ రోల్ చేయడంతో అంత ఇంపాక్ట్ అనిపించలేదు. 

 

సినిమా సూపర్ హిట్ అయినా నాని నెగిటివ్ రోల్ అంతగా జనాలకి రిజిస్టర్ కాలేదు. అయితే ఇప్పుడు చేస్తున్న వి సినిమా మాత్రం నాని పోషిస్తున్న నెగిటివ్ రోల్ బాగా సక్సస్ అయి ప్రేక్షకులు పర్మెనెంట్ గా గుర్తుంచుకునేలా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత నాని నటించబోతున్న మరో సినిమాలోను భిన్నమైన పాత్ర పోషించబోతున్నాడని సమాచారం. శ్యామ్ సింగ్ రాయ్ కూడా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రే అని తెలుస్తుంది. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించబోతున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలున్నాయని తెలుస్తుంది. 

 

ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో నాని టక్ జగదీష్ చేస్తున్న సంగతి తెలిసందే. ఈ కథ కూడా ఎంతో విభిన్నమైన పంథాలో సాగుతుందని అంటున్నారు. ఇక నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో నిన్ను కోరి వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే నాని ఇప్పుడు ఎంచుకుంటున్న కథలు కాస్త నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ తో కూడుకుంటున్నవే. అందుకు కారణం భారీ మల్టీ స్టారర్స్ లో నటించడం కోసమే అని తెలుస్తుంది. అంతేకాదు బాలీవుడ్ లో ఈ తరహా పాత్రలు చేయడానికి కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడట. అంటే పాన్ ఇండియా క్రేజ్ కోసమని చెప్పవచ్చు. మొత్తానికి నేచురల్ స్టార్ కొత్త స్ట్రాటజీ అదిరిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: