మెగాస్టార్ చిరంజీవి ఓదశలో వరుస ఫ్లాపులు ఇచ్చారు. దీంతో ఎలాంటి సినిమా చేయాలో తేల్చుకోలేక సంవత్సరం పాటు సినిమాలు చేయలేదు. చిరంజీవి సినిమా అంటే పాటలు, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ.. ఉండాల్సిందే. చిరంజీవిని నెంబర్ వన్ చేసింది ఈ అంశాలే. కానీ.. ఇవేమీ లేకుండా హీరోయిజం పక్కనపెట్టి చిరంజీవి ఓ  బరువైన పాత్ర చేస్తే.. ఊహించడానికే కష్టమైన ఆలోచన అది. కానీ పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి కొత్త తరహా సినిమాలు చేయాల్సి వచ్చింది. అలాంటి సినిమాలకు నాంది పలికుతూ చేసిన సినిమానే ‘హిట్లర్’.

IHG

 

ప్రేక్షకుల్లో వస్తున్న మార్పును, తాను మార్చాల్సిన సమయం వచ్చిందని గమనించారు చిరంజీవి. మళయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. తన ఆలోచనలకు ఈ కథ కరెక్ట్ గా ఉందనిపించి చిరంజీవి ఈ సినిమాను ఎంచుకున్నారు. ఏడుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా చాలా బరువైన పాత్ర అది. కామెడీ, ఎంటర్ టైన్మెంట్ ఉండవు. కానీ.. చిరంజీవి తన నటనతోనే మెప్పించాలి. ముఖ్యంగా అసంఖ్యాకమైన ఆయన అభిమానులను మెప్పించాలి. చిరంజీవి ఛాలంజ్ గా తీసుకుని ఈ సినిమా అదే పేరుతో రీమేక్ చేశారు. ఫ్యామిలీ, సెంటిమెంట్ చిత్రాలు తీయడంలో ఎక్ప్ పర్ట్ అయిన ముత్యాల సుబ్బయ్యను దర్శకుడిగా ఎంచుకున్నారు.

IHG

 

చిరంజీవిని ఊహించడానికి రుచించని సబ్జెక్టు, దర్శకుడితో మెగాస్టార్ చేసిన ప్రయాణం ఫలించింది. 1996లో ఏ సినిమా చేయని చిరంజీవి 1997 జనవరి 4న హిట్లర్ ను రిలీజ్ చేశారు. అభిమానులు, ప్రేక్షకుల నుంచి అపూర్వమైన స్పందన రావడంతో సినిమా సూపర్ హిట్ అయిపోయింది. చిరంజీవిలో దాగున్న నటనకు అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫలితంగా సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి కథకు, నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేసి అనేక హిట్లు సాధించారు చిరంజీవి.

IHG

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: