టాలీవుడ్ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ముందుగా ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. 

IHG

యువ గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పీఎస్ వినోద్ ఫొటోగ్రఫీని అందించగా యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇకపోతే ఈ సినిమాలోని సాంగ్స్ ఎంత గొప్ప పేరుని దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాముల, బుట్ట బొమ్మ సాంగ్స్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. మరోవైపు సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడం సాంగ్స్ ఈ రేంజ్ సక్సెస్ కు మరింత కారణంగా నిలిచింది. 

 

ఇకపోతే ఇప్పటికే ఈ మూడు లిరికల్ సాంగ్స్ కూడా 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని ముందుకు సాగుతుండగా, ఇటీవల బుట్టబొమ్మ వీడియో సాంగ్ 150 మిలియన్ల వ్యూస్ అందుకుని రికార్డు కొట్టగా, నిన్నటితో రాములో రాముల సాంగ్ వీడియో కూడా 100 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని మరొక రికార్డు ని సొంతం చేసుకుంది. ఈ విధంగా ఈ సినిమాలోని సాంగ్స్ కు రోజులు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం వ్యూస్ తగ్గకుండా యూట్యూబ్ లో ముందుకు దూసుకెళ్తున్నాయి. కాగా అలవైకుంఠపురములో సినిమా తోపాటు సాంగ్స్ కూడా ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడంతో అల్లు అర్జున్ కు మరింతగా క్రేజ్, ఫాలోయింగ్ పెరిగింది అనే చెప్పాలి....!!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: