నందమూరి హీరోలు పౌరాణిక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఈ జనరేషన్‌ లో కూడా పౌరాణిక సినిమా చేయాలంటే నందమూరి హీరోలే చేయాలన్న స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ బాట లోనే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తండ్రి నటించిన సినిమాలను తెలుగులో రీమేక్ చేశాడు. ఏ సినీ వారసుడు చేయని ఆ సాహసాన్ని బాలయ్య మాత్రమే చేశాడు. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భక్తి రస పౌరాణిక చిత్రం పాండురంగ మహత్యం. ఈ సినిమా 1957లో రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ రీమేక్‌ చేశాడు.

 

2008లో దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ సినిమాను ఈ సినిమాను పాండు రంగడు పేరుతో రీమేక్‌ చేశాడు బాలయ్య. అయితే ఎన్టీఆర్ సినిమా ఘనవిజయం సాధిస్తే బాలయ్య చేసిన రీమేక్‌ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ముఖ్యంగా కథా కథనాలు ఈ జనరేషన్‌ కు కనెక్ట్ కాకపోవటం, భక్తిరస చిత్రం లో శృంగార రసం కాస్త హద్దులు మీరటంతో ఈ సినిమా డిజాస్టర్‌ అయ్యింది. ఇక ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మరో అద్భుత దృశ్యకావ్యం లవ కుశ. అప్పట్లో ఈ సినిమా చూడటానికి బండ్లు కట్టుకొని మరి ప్రజలు పల్లెల నుంచి పట్నాలకు వెళ్లారట.
IHG

 

ముఖ్యంగా తెర మీద రాముడిగా ఎన్టీఆర్‌ ను చూసి తెరలకే పూజా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి క్లాసిక్‌ను కూడా రీమేక్‌ చేశాడు బాలయ్య. లవ కుశ కథతోనే బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమా శ్రీరామ రాజ్యం. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా బాలయ్య, సీతగా నయనతార నటించారు. అయితే లవ కుశ కథతోనే తెరకెక్కిన ఈ సినిమా లవ కుశ మ్యాజిక్‌ను మాత్రం రిపీట్ చేయలేకపపోయింది. దీంతో మరోసారి బాలయ్యకు నిరాశే ఎదురైంది. ఇలా తండ్రి చేసిన సినిమాలను రీమేక్‌ చేసిన అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్న బాలయ్య, ఆ సినిమాలు డిజాస్టర్ కావటంతో నిరాశపరిచాడు.
IHG

మరింత సమాచారం తెలుసుకోండి: