సాధారణంగా హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ రోజులు ఉంటుంది. హీరోలకి ఎన్నేళ్లయినా ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ హీరోయిన్లకి అలా కాదు. తనలోని గ్లామర్ పాళ్ళు తగ్గాయంటే చాలు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతుంటాయి. కొత్త వాళ్ళు వచ్చేస్తుంటారు. వారితో అందంలో గ్లామర్ ని ఒలకబోయడంలో పోటీపడడం కష్టం అవుతూ ఉంటుంది. అందుకే ఒకానొక స్టేజికి వచ్చేసరికి హీరోయిన్లు ఫేడ్ అవుట్ ఉంటారు.

 

 

చాలా కొద్ది మంది మాత్రమే ఎన్నేళ్లయినా తరగని అందం, చెదరని సొంపులతో అలాగే ఉంటారు. అలాంటి వారిలో అనితా హస్సానందిని ఒకరు. ఇలా చెప్తే ఎవ్వరూ గుర్తుపట్టలేరు. సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన అనిత అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి.

 

 

అయితే ఆ అవకాశాలు విజయాఅలని తెచ్చిపెట్టలేకపోయాయి. అందువల్ల ఎక్కువ సినిమాల్లో కనిపించకుండానే ఫేడ్ అవుట్ అయిపోయింది. మధ్యలో ఐటెం సాంగ్స్ లో చేసినప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కి వెళ్ళి హిందీ సీరియళ్లలో నటిస్తుంది. హిందీ సీరియళ్లలో ఆమెకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అక్కడ సంపాదన కూడా బాగానే ఉంది. సీరియళ్ళలోనూ తన గ్లామర్ తో కుర్రకారుని అట్రాక్ట్ చేస్తుంది.

 

నువ్వు నేను సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పటికీ అలానే కనిపిస్తుంది. ఏమాత్రం చెక్కుచెదరని అందంతో అనితని చూసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు.  2013లో ప్రముఖ పారిశ్రామిక వేత్త రోహిత్ రెడ్డిని పెళ్ళి చేసుకుని ఇల్లాలుగా మారిన తర్వాత కూడా సీరియళ్ళలో నటిస్తుంది. ఆమె చేసిన సీరియళ్లలో చాలా హిట్ సీరియల్స్ ఉన్నాయి. ప్రస్తుతం నాగిని ౪ లో ఆమె కనిపిస్తుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: