పవన్ కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా గా పేరు తెచ్చుకున్న చిత్రం గబ్బర్ సింగ్. టాలీవుడ్ లో ఈ సినిమా ఒక సంచలనం. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ సినిమా దబంగ్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా అనేక రికార్డులు  బద్దలు కొట్టింది. ఒక్క మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా మంచి జోష్ ఇచ్చింది అనే చెప్పవచ్చు. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ ఒక ఎత్తు అక్కడి నుంచి మరో ఎత్తు అనే విధంగా ఈ సినిమా విజయ౦ సాధించింది అనేది వాస్తవం. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దబంగ్ కన్నా బాగుంది అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు కామెంట్లు చేసారు. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు టాలీవుడ్ లో అప్పటి వరకు లేని కామెడి ని వినోదాన్ని అందించాయి అనేది వాస్తవం. ఈ సినిమా వసూళ్ళ పరంగా కూడా పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ అనే చెప్పుకోవచ్చు ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ అక్కడి నుంచి స్టార్ నిర్మాత అయిపోయాడు. అక్కడి నుంచి సినిమాలు చేసినా లేకపోయినా అతన్ని స్టార్ నిర్మాత అనడం మొదలుపెట్టారు కొందరు. 

 

ఏది ఎలా ఉన్నా ఈ సినిమా సాధించిన విజయం వసూళ్లు మాత్రం టాలీవుడ్ కి కమర్షియల్ అనే కోణాన్ని పరిచయం చేసాయి అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు. కాని ఆయన ఆ స్థాయిలో మరో విజయం దక్కలేదు అనే చెప్పాలి. పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: