టాలీవుడ్ లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా బిల్లా. ప్రభాస్ హీరో గా వచ్చిన ఈ సినిమా అతని కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ అనేది టాలీవుడ్ జనాల మాట. కొందరు అయితే సినిమా కథ ప్రేక్షకులకు ఎక్కలేదు కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ అయింది అని అంటూ ఉంటారు. ఈ సినిమా తో ప్రభాస్ రేంజ్ పెరిగినా సరే ఈ సినిమా మాత్రం అతని కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ అనేది వాస్తవం. ఈ సినిమా కోసం అతను చాలా చాలా కష్టపడ్డాడు. అయినా సరే పెద్దగా ఫలితం లేకుండా పోయింది అనేది వాస్తవం. 

 

ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన సినిమాలో కొన్ని సన్నివేశాలు తీసిన విధానం  బాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి లేదా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అనే కామెంట్స్ వచ్చాయి. కాని సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన బిల్లా సినిమా రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. అక్కడి నుంచి ప్రభాస్ వరుసగా సినిమాలు అదే కోణం లో చేస్తాడు అనుకున్నా సరే ఇక అక్కడి నుంచి అతను ప్రయోగాలు కూడా చేయలేదు. సినిమాలో ప్రభాస్ మొదటి పాత్ర చనిపోక ముందు వరకు ఒక రేంజ్ లో ఉన్న సినిమా... 

 

ఆ తర్వాత పాతాళానికి పడిపోయింది అనేది వాస్తవం. ఈ సినిమాలో అనుష్క హీరో యిన్ గా నటించగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి అనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా రెండు ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడు కూడా. అయితే ఈ సినిమా యూత్ కి బాగా నచ్చింది అని టాక్. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం బోరింగ్ గా అనిపించాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: