జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన సినిమాల్లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఏది అయినా ఉంది అంటే కాటమరాయుడు. ఈ సినిమాను తమిళ రీమేక్ సినిమా గా తీసుకొచ్చారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మాత్రం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది అనేది టాలీవుడ్ జనాల మాట. ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ సహా ఆయన ఫాన్స్ అలాగే టాలీవుడ్ లో కొందరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా సరే ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అనేది అందరికి అర్ధమైంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా సమయాన్ని ఇచ్చారు. 

 

సినిమా తర్వాత ఆయన తో సినిమా చెయ్యాలి అంటే నిర్మాతలు భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఆయన అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా సినిమాలు చేసారు. వరుస సినిమాలు చెయ్యాలి అని భావించినా సరే అది మాత్రం సాధ్యం కాలేదు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ భారీగా పారితోషికం కూడా తీసుకున్నాడు. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాల మీద ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేసారు. మొదటి పావు గంట మినహా ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత సినిమా మొత్తం కూడా ఎప్పుడు లేచి బయటకు వద్దామా అనే విధంగా ఉంది అని రివ్యూ లు కూడా రాసారు కొందరు ప్రేక్షకులు. 

 

సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది కాస్త్య్హ సాధారణ ప్రేక్షకుల్లో తగ్గింది అనే కామెంట్స్ కూడా ఎక్కువగానే వినిపించాయి. ఏది ఎలా ఉన్నా సరే పవన్ మాత్రం ఈ సినిమా నుంచి కాస్త డల్ అయ్యారు అనేది కూడా వినపడింది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: