టాలీవుడ్ లో ప్రయోగాలు చేయడానికి ఏ మాత్రం కూడా భయపడని హీరోలు కొందరు ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరో వెంకటేష్. ఆయన ఏ సినిమా అయినా సరే తనకు కథ నచ్చితే అది భిన్నంగా ఉన్నా మరొకరకంగా ఉన్నా సరే ఎక్కడా కూడా భయపడకుండా సినిమాలను చేస్తూ ఉంటారు. ఆయన కెరీర్ లో వచ్చిన చాలా సినిమాలు ఎక్కువగా ప్రయోగాలు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే ప్రేక్షకులు మాత్రం చాలా బాగా ఆదరించారు అనేది కూడా వాస్తవం. 

 

ఆయన చేసిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఘర్షణ. ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. ఈ సినిమా కథ కూడా చాలా భిన్నంగా ఉండటం తో ప్రేక్షకులు ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే చూస్తూ ఉంటారు అనేది అనేది వాస్తవం. ఈ సినిమా కథ నుంచి ఈ సినిమాలో నటించిన నటులు పోలీస్ గా వెంకటేష్ నటన ఈ సినిమా సంగీతం అన్నీ కూడా చాలా చాలా బాగా ఆకట్టుకున్నారు అనేది తెలిసిందే. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. అక్కడి నుంచి దీనిని రీమేక్ చేసారు. 

 

సినిమా తర్వాత వెంకటేష్ సినిమాలు అనగానే చాలా మంది ప్రేక్షకులకు ఒక క్రేజ్ వచ్చింది. ఆయన సినిమాలు ఈ తరానికి కూడా చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. ఘర్షణ సినిమాను ఈ తరం బాగానే చూస్తుంది. అలాగే ఆయన కెరీర్ లో గురు రీమేక్ ప్రస్తుతం చేస్తున్న నారప్ప రీమేక్ అన్నీ కూడా హాట్ టాపిక్. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన రీమేక్ చేసే విషయంలో ఏ మాత్రం కూడా భయపడే పరిస్థితి ఉండదు. ఎలాంటి సినిమా అయినా రీమేక్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: